Share News

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 01:12 AM

శాఖ గ్రంథాలయం చినగంజాంలో నిర్వహి స్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్స వాల ముగింపు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

చినగంజాం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): శాఖ గ్రంథాలయం చినగంజాంలో నిర్వహి స్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్స వాల ముగింపు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వారోత్సవాలను పురస్కరించుకొని గ్రంథాలయం ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖనం, తెలుగు పద్యాలు లెమన్‌స్ఫూన్‌ పోటీలలో విజేతలైన విద్యార్థు లకు బహుమతులు అందజేశారు. గ్రంథపా లకుడు ఎ.మోహనలక్ష్మీనరసింహాచార్యులు అధ్యక్షతన జరిగిన సభలో ఎంఈవో బి.అజయ్‌బాబు, చినగంజాం, రాజుబంగారు పాలెం జడ్పీ ఉన్నతపాఠశాలల హెచ్‌ఎంలు కె.శ్రీనివాసరెడ్డి, ఆర్‌వీఎస్‌.పోతురాజు, రిటైర్డ్‌ ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌ పర్వతరెడ్డి కాంతా రావు, రిటైర్డ్‌ ఈ.ఈ కుర్రి రామసుబ్బారావు, భావనారాయణస్వామి దేవస్థానం అబివృద్ధి కమిటీ సభ్యులు వలివేటి వెంకట రామా నుజన్‌లు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఉత్తమ ఉపాఽధ్యాయ అవార్డు గ్రహిత శివవెంకటపోతురాజు ఉపాధ్యా యులు చుండూరి వెంకట్‌, వై.రామాంజ నేయులు, దామోదర్‌రెడ్డి, ఎన్‌.రామాంజనే యులురెడ్డి, బ్రహేంద్ర కుమార్‌రెడ్డి, శాంత కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 01:12 AM