ప్రకృతి అందాలను పరిరక్షిద్దాం
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:30 PM
ప్రకృతిలోని అందాలను పరిరక్షించి, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మె ల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం దిగువమెట్ట అటవీ ప్రాం తంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
దిగువమెట్ట అటవీ ప్రాంతంలో వన విహారిని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రకృతిలోని అందాలను పరిరక్షించి, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మె ల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం దిగువమెట్ట అటవీ ప్రాం తంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వనవిహారి ఉడెన్ కాటేజీలను ఆయన ప్రారంభించారు. తొలుత అక్కడ మొక్కలను నాటారు. అనంతరం అశోక్‌రెడ్డి మాట్లాడుతూ మానవుని జీవన విధానం, జీవనశైలి ప్రకృతి నుండే ప్రారంభం అయిందని తెలిపారు. దిగువమెట్ట అటవీ ప్రాంతంలో జీవనం సా గించే కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీఎఫ్ ఎఫ్‌డీపీటీ బి.విజయ్‌కుమార్ ఐపిఎస్, ప్రాజెక్టు డైరెక్టర్ నిషా కుమారి, అనురాగ్, జి.విఘ్నేష్, పి.అంక య్య, మార్కెట్ యార్డు చైర్మన్, వైస్ చైర్మన్ బైలడుగు బాలయ్య, గోడి ఓబులరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్, మండలపార్టీ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు పాలుగుళ్ల ప్రతాపరెడ్డి, దప్పిలి భాస్కర్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు శానేషావలి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాలీశ్వరయ్య, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.