పరిశుభ్రత పాటిద్దాం..
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:19 AM
జిల్లావ్యాప్తంగా శనివారం పరిశుభ్రత పాటిద్దాం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ప్రతినెలా మూడో శనివారం రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వారం వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు.
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
విద్యా సంస్థలపై ఎక్కువ దృష్టి
ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు
ఒంగోలు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా శనివారం పరిశుభ్రత పాటిద్దాం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ప్రతినెలా మూడో శనివారం రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వారం వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. తదనుగుణంగా జిల్లావ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాలను అధికారులు నిర్వహిం చారు. గ్రామస్థాయి వరకు విద్యా సంస్థల్లో పరిశుభ్రత చర్యలతోపాటు విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. మొక్కలను కూడా నాటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతి నిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంతనూతలపాడు మండలం మద్దు లూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్, కలెక్టర్ రాజాబాబు హాజరయ్యారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. హైస్కూల్‌లో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. కనిగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. గిద్దలూరు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొని పరిశుభ్రతపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. టీడీపీ వైపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు ఇతర ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున పరిశుభ్రత పాటిద్దాం కార్యక్రమాలు జరిగాయి.