Share News

ప్లాస్టిక్‌ రహిత నియోజకవర్గంగా మారుద్దాం

ABN , Publish Date - May 17 , 2025 | 11:47 PM

మార్కాపురం నియోజకవర్గాన్ని ప్లాస్టిక్‌రహిత నియోజకవర్గంగా మారుద్ధామని ఎ మ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం స్వర్ణాంధ్ర - స్వ చ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్‌ ద హీట్‌ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మన్సిపల్‌ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ప్లాస్టిక్‌ రహిత నియోజకవర్గంగా మారుద్దాం

స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో

ఎమ్మెల్యే నారాయణరెడ్డి

మార్కాపురం, మే 17 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం నియోజకవర్గాన్ని ప్లాస్టిక్‌రహిత నియోజకవర్గంగా మారుద్ధామని ఎ మ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం స్వర్ణాంధ్ర - స్వ చ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్‌ ద హీట్‌ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మన్సిపల్‌ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పక్షులకు దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్లతో నీటిని నింపారు. దాణా అందించారు. గాంధీ పార్కులో మొక్కలు నాటా రు. పాదచారులకు మజ్జిగ ప్యాకెట్లు పం పిణీ చేశారు. స్థానిక గాంధీ పార్కు నుం చి దోర్నాల బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ప్రయాణికుల కోసం ము న్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలన్నారు. బహిరంగ ప్ర దేశాల్లో చెత్త వేయరాదన్నారు. మన ఊరి పరిశుభ్రత మన చేతుల్లోనే ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరెడ్డి, మున్సిపల్‌ ఏఈ భూపాల్‌రెడ్డి, మెప్మా సిబ్బంది, టీడీపీ నా యకులు తాళ్లపల్లి సత్యనారాయణ, వెంకటరెడ్డి, ఖాశిం పాల్గొన్నారు.

మార్కాపురం రూరల్‌ : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఉంటుందని తహసీల్దార్‌ చిరంజీవి తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న ఖాళీ స్థలం లో తహసీల్దార్‌ చిరంజీవి సిబ్బందితో కలి సి స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలలో చెత్త చెదారాన్ని వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పశువుల వ్యర్థాలను ఇంటి పరిసరాలలో వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు గ్రామాలలో ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వీఆర్వోలు, తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని చింతగుంట్ల గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో సచివాలయ ఉద్యోగులు ప్రజలకు స్వచ్ఛ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.

గిద్దలూరు : మండలంలోని కెఎ్‌సపల్లి పంచాయతీలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏపీఈడీవో రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ అనంతరం స చివాలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశా రు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన పశువుల నీటి తొట్టెను పరిశీలించారు. మొక్కలు నాటారు. చెత్త సేకరణ కోసం రిక్షాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి రోజూ చెత్త సేకరణ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూ టీ ఎంపీడీవో చెన్నారా వు, స్వచ్ఛ భారత్‌ ప్రతినిధి బాబూరావు, ఏపీవో రమణి, సచివాలయ కార్యదర్శులు రాఘవరావు, భాస్కర్‌, సర్పంచ్‌ ఎలిజబెత్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పొదిలి : ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సాధనకు కృషి చేయాలని నగరపంచాయతీ కమిషనర్‌ కేఎల్‌ఎన్‌రెడ్డి అన్నారు. శనివారం నగరపంచాయతీ కార్యాలయం నుంచి పెద్దబస్టాండ్‌ వరకు స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్‌ ది హీట్‌ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతినెలా మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున చలివేంద్రాలు, హెల్త్‌ క్యాంపులను నిర్వహించాలని సూచించారు. దా తలు ఎవరైనా ఉంటే ప్రజల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. పెద్దబస్టాండ్‌ సెంటర్లో చలివేంద్రం, హెల్త్‌క్యాంపు ఏర్పాటు చేసి మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో విజయలక్ష్మి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మారుతీరావు, పంచాయతీ సెక్రెటరీ శ్రీకాంత్‌, ఈవోఆర్డీ గుత్తా శోభన్‌బాబు, సీనియర్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరెడ్డి, వైద్య సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

పెద్దారవీడు : ఎంపీడీవో జాన్‌సుందరం ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, ఉద్యోగులు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పారిశుధ్యాన్ని పాటించాలని, ప్లాస్టిక్‌ను నిషేధించాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీ రామనారాయణరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ఏపీఎం కృపావతి, ఆశాలు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 11:47 PM