Share News

మరపగుంట్లలో చిరుత సంచారం!

ABN , Publish Date - Sep 30 , 2025 | 01:19 AM

వెలిగండ్ల మండలం మరపగుంట్ల పంట పొలాల్లో సోమవారం చిరుత పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. రోజూలాగే పనుల నిమిత్తం గ్రామస్థులు పొలాల్లోకి వెళ్లగా వారిని గమనించిన చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మరపగుంట్లలో చిరుత సంచారం!
చిరుత పులి అడుగులను పరిశీలిస్తున్న అటవీ అధికారులు

భయాందోళనలో గ్రామస్థులు

ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని అటవీ అధికారుల సూచన

వెలిగండ్ల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : వెలిగండ్ల మండలం మరపగుంట్ల పంట పొలాల్లో సోమవారం చిరుత పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. రోజూలాగే పనుల నిమిత్తం గ్రామస్థులు పొలాల్లోకి వెళ్లగా వారిని గమనించిన చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. రైతులు, కూలీలు భయాందోళన చెంది గ్రామంలోకి పరుగులు తీశారు. విషయం తెలిసి గ్రామస్థులు చిరుత సంచరించిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ దాని అడుగులను గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆప్రాంతానికి చేరుకు న్నారు. చిరుతపులి అడుగు జాడలను గుర్తించిన అధికారులు అవి చిరుత పులివా.. ఇతర జంతువివా? అని నిర్ధారించలేకపోయారు. ఇదిలాఉండగా పొలాల్లో చిరుతపులి కనిపించిందన్న సమాచారంతో పరిసర ప్రాంత గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల వద్దకు రైతులు ఒంటరిగా వెళ్లకుండా కొన్నిరోజులపాటు జాగ్రత్త వహించాలని అటవీ అధికారులు సూచించారు

Updated Date - Sep 30 , 2025 | 01:19 AM