Share News

ఆలస్యంగా అమృత్‌ భారత్‌ పనులు

ABN , Publish Date - Dec 11 , 2025 | 09:37 PM

నూతనంగా జిల్లా కేంద్రం కానున్న మార్కాపురం రైల్వే స్టేషన్‌లో సమస్యలు తిష్ట వేశాయి. నిత్యం శ్రీశైలం వెళ్లే భక్తులకు మార్కాపురం రైల్వే స్టేషన్‌ నుంచే ప్రయాణాలు చేస్తుంటారు. పండుగ సమయాలలో ముఖ్యంగా కార్తీక మాసం, ఉగాది, శివరాత్రి పర్వదినాలలో రద్దీ చాలా ఎక్కువ. మార్కాపురం రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

ఆలస్యంగా అమృత్‌ భారత్‌ పనులు

రైల్వే స్టేషన్‌లో సౌకర్యాల కొరత

అవస్థలు పడుతున్న ప్రయాణికులు

మార్కాపురం రూరల్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : నూతనంగా జిల్లా కేంద్రం కానున్న మార్కాపురం రైల్వే స్టేషన్‌లో సమస్యలు తిష్ట వేశాయి. నిత్యం శ్రీశైలం వెళ్లే భక్తులకు మార్కాపురం రైల్వే స్టేషన్‌ నుంచే ప్రయాణాలు చేస్తుంటారు. పండుగ సమయాలలో ముఖ్యంగా కార్తీక మాసం, ఉగాది, శివరాత్రి పర్వదినాలలో రద్దీ చాలా ఎక్కువ. మార్కాపురం రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మార్కాపురం రైల్వే స్టేషన్‌ లో అమృత్‌ భారత్‌ పథకం కింద మంజూరైన పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. ఆధునికీకరణ చేసేందుకు రూ.21కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ పనులను 2024 ఫిబ్రవరి 26వతేదీన ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. నాలుగు లిఫ్ట్‌లు అందుబాటులో ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 2 మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. మరో రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రయాణికుల వెయిటింగ్‌ హాలు, డార్మిటరీ రూముల నిర్మాణాలు ప్రస్తుతం పిల్లర్ల దశలో ఉన్నాయి. మూడవ ప్లాట్‌ ఫాం పనులు నత్తనడన సాగుతున్నాయి. కాలి నడక వంతెన, ఎక్స్‌వేటర్‌లను రెండు నిర్మించాల్సి ఉంది. ప్రయాణికులకు తాగు నీటి వసతి కోసం నీటి శుద్ధి యంత్రం ఉన్నప్పటికీ మరమ్మతులకు గురైంది. దీంతో ఆ గదిలో పనికి రాని సామగ్రితో నింపారు. దివ్యాంగుల కోసం మరుగు దొడ్డి గది ఉన్నా తాళ ం వేశారు. ఇప్పటికైనా రైల్వే అఽధికారులు అభివృద్ధి పనులపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చే సేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Dec 11 , 2025 | 09:38 PM