చివరి అవకాశం
ABN , Publish Date - Dec 21 , 2025 | 02:16 AM
ఉపాధి హామీ పనులు (2014-19 మధ్య) చేసినా గత వైసీపీ ప్రభుత్వ వేధింపులు, కక్షసాధింపు చర్యలతో బిల్లులు రాక అప్పులపాలైన వారికి ఊరట లభించనుంది. ఆ పనుల నమోదుకు ప్రస్తుత ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది.
నాటి ఉపాధి పెండింగ్ పనుల నమోదుకు గ్రీన్‌సిగ్నల్
రేపటిలోగా డ్వామా కార్యాలయానికి వివరాలు, ఆ తర్వాత క్లోజ్
ఇప్పటివరకు రూ.87కోట్ల విలువైన 2,996 పనుల జాబితా చేరిక
గతేడాది రూ.23కోట్ల బిల్లుల చెల్లింపు
రూ.45కోట్లు పెండింగ్
ఉపాధి హామీ పనులు (2014-19 మధ్య) చేసినా గత వైసీపీ ప్రభుత్వ వేధింపులు, కక్షసాధింపు చర్యలతో బిల్లులు రాక అప్పులపాలైన వారికి ఊరట లభించనుంది. ఆ పనుల నమోదుకు ప్రస్తుత ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. దాదాపు ఏడాదిగా ఈ ప్రక్రియ సాగుతుండగా వేలసంఖ్యలోనే పనుల జాబితాలు అధికారులకు చేరాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వాటి నమోదుకు సాఫ్ట్‌వేర్ అనుమతి ఇవ్వాల్సి ఉండటంతో బిల్లులు విడుదల కాలేదు. ఈ విషయమై కేంద్రంతో సీఎం, డిప్యూటీ సీఎంలు పలువిడతలుగా సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా శనివారం ఢిల్లీ పర్యటనలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దానిపై అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో అధికారులు తదనుగుణంగా చర్యలకు సిద్ధమయ్యారు.
ఒంగోలు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభ్యర్థన మేరకు కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఉపాధి పెండింగ్ బిల్లుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం చివరి అవకాశం ఇచి ్చంది. అలాంటి పనులను క్షేత్రస్థాయి అధికారులు నమోదు చేసి ఈనెల 22వతేదీ సాయంత్రానికి డ్వామా పీడీ కార్యాలయాలకు చేర్చాలని ఆదేశించింది. 2014-19 మధ్యకాలంలో ఉపాధి మెటీరియల్ కోటా నిధులతో పెద్దఎత్తున నాటి టీడీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. మౌలిక సదుపాయాలైన సీసీరోడ్లు, డ్రెయిన్‌లు, పంచాయతీ, అంగన్ వాడీ భవనాలు, స్కూళ్లకు ప్రహరీల నిర్మా ణం, శ్మశానాల అభివృద్ధి, తాగునీటి పైపు లైన్లు, గ్రావెల్ రోడ్లు వంటివి భారీగా చేయిం చింది. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల విలువైన పనులు జరగ్గా జిల్లాలోనూ సుమారు వెయ్యి కోట్లకుపైగా చేశారు. అయితే 2019 ఎన్నికల ముందు ఏడాది (2018-19)లో చేసిన పనులకు ఆర్థిక వెసులుబాటు పరిమితితోపాటు ఎన్నికల కారణంగా బిల్లుల చెల్లింపు సకాలంలో జరగలేదు.
రూ.150కోట్ల బిల్లులు పెండింగ్
2018-19 ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం రావడంతో పెండింగ్ బిల్లులు చెల్లింపులు నిలిపేసింది. సుమారు రూ.150 కోట్ల వరకు అలా నిలిచిపోయాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా పనులు చేసిన వారికి ఇవ్వలేదు. ఈ పనులలో కొన్ని మాత్రమే ప్రభుత్వ లెక్కల్లోకి అంటే డ్వామా పరిధిలోని కంప్యూటర్‌లోని సంబంధిత సాప్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్ చేయగా అత్యధిక భాగం ఎం.బుక్ నమోదు కూడా చేయలేదు. ఎం.బుక్ నమోదు చేసినా కంప్యూటర్‌లో అప్‌లోడ్ జరగలేదు. అలా వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలతో అప్పట్లో పనులు చేసిన వందలాది మంది టీడీపీకి చెందిన గ్రామస్థాయి నాయకులు డబ్బులే రాక అప్పులపాలై గగ్గోలుపెట్టారు. కొద్దిమంది కోర్టుకు వెళ్లి అరకొర బిల్లులు పొందినప్పటికీ 95శాతం మంది అవస్థలు పడ్డారు. కాగా తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ బిల్లులు చెల్లింపు అంశం తెరపైకి వచ్చింది. పెండింగ్ పనులకు సంబంధించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయిన వాటికి మాత్రమే చెల్లింపులకు అవకాశం ఉండటంతో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేసింది. అలా జిల్లాలో రూ.37కోట్లు విలువైన పనుల వివరాలు అప్‌లోడ్ చేసి ఉండగా వాటిలో రూ.23కోట్లు రెండు విడతలుగా విడుదల చేసింది. మరో రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉంది.
అందుబాటులో లేని వివరాలు
చెల్లింపులు జరిగినవిపోను మరో రూ.100 కోట్ల విలువైన పనులు జరిగి ఉన్నట్లు అంచనా. వాటిలో వర్క్ ఐడీ ఉన్న వాటిని క్లోజ్ చేసినట్లు అప్పటి వైసీపీ ప్రభుత్వం చూపించడంతో ప్రస్తుతం ఆ వివరాలు అందుబాటులో లేవు. మరికొన్నింటికి ఎం.బుక్ నమోదు కాకపోగా, మరికొన్ని అసలు సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ కాలేదు. మరోవైపు ఆ పనులు జరిగిన కాలంలో టీసీఎస్ సాఫ్ట్‌వేర్ ఉండగా అనంతరం మరో కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను మార్చడంతో అసలు ఏ వివరాలూ అందుబాటులో లేవు. పాత వాటిని పరిశీలించాలన్నా, తిరిగి అప్‌లోడ్ చేయాలన్నా కేంద్రప్రభుత్వం పాత సాఫ్ట్‌వేర్‌ను పునరుద్ధరించాల్సి ఉంది. అందుకోసం ఏడాది కాలంగా సీఎం, డిప్యూటీ సీఎంలు ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు మండల స్థాయి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న రికార్డులు, పనులు చేసిన వారి దగ్గర ఆధారాల ప్రాతిపదికన పెండింగ్ పనుల వివరాలు సేకరిస్తున్నారు. అలా జిల్లాలో రూ.87 కోట్ల విలువైన 2,996 పనుల జాబితా డ్వామా పీడీ కార్యాలయానికి చేరింది.
కొండపి, గిద్దలూరుల్లో అత్యధికం
జిల్లాలో అత్యధికంగా మంత్రి స్వామి ప్రాతినిథ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గంలోనే 2,104, గిద్దలూరులో 718 పనులు చేశారు. ఇతర నియోజకవర్గాల్లోనూ ఉన్నాయి. ఆయా పనుల వారీ వివరాల అప్‌లోడ్‌కు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చేసేలా అంతా సిద్ధం చేసి ఉంచారు. కాగా ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిని ఆలకించిన కేంద్రం ఆ పనులు అప్‌లోడ్‌కు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమై సదరు సంకేతాలను రాష్ట్రానికి ఇచ్చినట్లు సమాచారం. దీంతో అలాంటి పనులు ఇంకా ఏమైనా ఉంటే తక్షణం వివరాలు ఇవ్వాలని అన్ని జిల్లాల పీడీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. దీంతో జిల్లాలో ఈ తరహా పెండింగ్ పనులు ఉంటే ఈనెల 22లోపు తమ కార్యాలయానికి అందజేయాలని డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ అన్ని మండలాల అధికారులకు సూచించారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఈనెల 22 తర్వాత వివరాలు తీసుకునే అవకాశం లేదని ఆయన తెలిపారు. పనులు చేసి అవి నమోదు కాక, బిల్లులు రాక ఎదురుచూస్తున్న వారు కూడా మండల స్థాయిలో ఏపీడీవోలను సంప్రదించి సంబంధిత పనుల వివరాలను తమ కార్యాలయానికి వచ్చేలా చూసుకోవాలని