సోలార్ హబ్ ఏర్పాటుకు భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:12 PM
సోలార్ హబ్ ఏర్పాటుకు అవసరమైన భూములను వెంటనే సేకరించే పనులు ప్రారంభించాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు చెప్పారు. బుధవారం బల్లికురవ తహసీల్దార్ కార్యాలయంలో సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు చెందిన తహసీల్దార్లతో ఆర్డీవో సమీక్షించారు.
బల్లికురవ, సంతమాగులూరు తహసీల్దార్లతో ఆర్డీవో సమీక్ష
బల్లికురవ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : సోలార్ హబ్ ఏర్పాటుకు అవసరమైన భూములను వెంటనే సేకరించే పనులు ప్రారంభించాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు చెప్పారు. బుధవారం బల్లికురవ తహసీల్దార్ కార్యాలయంలో సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు చెందిన తహసీల్దార్లతో ఆర్డీవో సమీక్షించారు. మెత్తం 1800 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని, రైతులకు ఎకరాకు రూ. 18 లక్షల పరిహారం అందించేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రెండు మండలాల పరిధిలో ఉన్న ఎస్‌ఎల్ గుడిపాడు, కుందుర్రు మామిళ్లపల్లి గ్రామాలలో ఉన్న రైతులను కలిసి భూసేకరణ చేపట్టాలన్నారు. సోలార్ హబ్‌కు రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపిందని చెప్పారు. సోలార్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు అయితే నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయన్నారు. అనంతరం ఆర్డీవో భూములకు సంబంధించిన మ్యాప్‌ను తహసీల్దార్లతో సమిక్ష చేశారు. ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయి వాటిని కూడా సోలార్ హబ్‌లో తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమీక్షలో తహసీల్దార్లు రవినాయక్, రవిబాబు, మార్కెట్ యార్డు చైర్మన్ తేలప్రోలు రమేష్ తదితరులు పాల్గొన్నారు.