Share News

పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే లేబర్‌ కోడ్స్‌ చట్టాలు

ABN , Publish Date - Jul 09 , 2025 | 10:34 PM

కేంద్రంలోని మోదీప్రభుత్వం స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ప్రయోజనాల కోసం కార్మికుల చట్టాలను లేబర్‌కోడ్స్‌కు తెస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మండిపడ్డారు.

పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే లేబర్‌ కోడ్స్‌ చట్టాలు
ఒంగోలులో ర్యాలీ నిర్వహిస్తున్న వివిఽధవామపక్ష సంఘాల నేతలు, కార్మికులు, ఉద్యోగులు

వివిధ రంగంలోని కార్మికులకు గుర్తింపు ఇవ్వాలి

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

దేశ ప్రయోజనానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం

ఒంగోలు కలెక్టరేట్‌,జూలై 9 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని మోదీప్రభుత్వం స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ప్రయోజనాల కోసం కార్మికుల చట్టాలను లేబర్‌కోడ్స్‌కు తెస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మండిపడ్డారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట కార్మిక సంఘాలు నిర్వహించిన ధర్నాకు ఏఐటీయూసీ నగర కార్యదర్శి శ్రీరామ్‌ శ్రీనివాసరావు, సీఐటీయూ నగర కార్యదర్శి మహేష్‌ అధ్యక్షతన జరిగిన ధర్నాలో రామకృష్ణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న లేబర్‌ కోడ్‌లను రద్దు చేసి కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, ఉద్యోగ కార్మికులను రెగ్యూలర్‌ చేయాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించలాన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు, కార్మిక, శ్రామికులు పెద్దఎత్తున సమ్మెలో పాల్గొంటున్నందున ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ, విద్యుత్‌, రవాణా, బ్యాంకు, ఇన్సూరెన్స్‌, టెలిఫోన్‌, స్టీల్‌ప్లాంట్లు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గంగా ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కళ్లు తెరిచి కార్మికుల చట్టాలను కొనసాగించాలని లేనిపక్షంలో తగిన మూల్యం తప్పదని రామకృష్ణ హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, ఐఎ్‌ఫటీయూ నాయకులు ఎంఎ్‌ససాయిలు మాట్లాడుతూ జిల్లాలో సంక్షోభంలో ఉన్న గ్రానైట్‌ డిజైన్‌ప్లేట్లు, ఇతర పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలన్నారు. ఒంగోలులో ఈఎ్‌సఐ హాస్పటల్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు, కిసాన్‌ మోర్చా కన్వీనర్‌ చుండూరి రంగరావు, వివిఽధసంఘాలనేతలు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కంకణాల ఆంజనేయులు, ఆర్‌. వెంకట్రావు, అయ్యప్పరెడ్డి చిరంజీవి, కృష్ణమోహన్‌, ఈదర అన్నపూర్ణ, ఆర్‌, రాజ్యలక్ష్మీ, రాజేష్‌, రత్నాకర్‌, శ్రీనివాసరావు, రమణయ్య, పారా శ్రీనివాసరావు, తాళ్ళూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తొలుత ఆర్టీసీ బస్టాండు నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Jul 09 , 2025 | 10:34 PM