Share News

భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు

ABN , Publish Date - Aug 17 , 2025 | 02:09 AM

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను చీరాల నియోజకవర్గంలో భక్తులు అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు

చీరాల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను చీరాల నియోజకవర్గంలో భక్తులు అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించారు. పలు చోట్ల యువకులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహ పరిచారు. నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాధ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని ఉట్టికొట్టి ఉత్సాహ పరిచారు. పూర్వికులు ఆనవాయితీగా ఆచరించే పండుగలతోనే ఆత్మీయత, ఆనందమని చెప్పారు. యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉట్టికొట్టడం, కోలాటం, మ్యూజికల్‌ నైట్‌లో పాల్గొన్నారు. అనంతరం అన్న సంత్పర్పణ నిర్వహించారు. స్థానిక గొల్లపాలెంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

వేటపాలెం మండల పరిధిలోని దత్తక్షేత్రంలో రాధాకృష్ణ మందిరం ప్రారంభించారు. ఈక్రమంలో భక్తులు విశేషంగా హాజరయి కృష్ణాష్టకం, హరేరామ సంకీర్తనాలతో స్వామిని దర్శించుకున్నారు. కార్యక్ర మాన్ని ఎన్‌ఆర్‌ఐ కిరణ్‌ కోడూరి నిర్వహించగా, క్షేత్రం కన్వీనర్‌ ప్రమీలదేవీ, ప్రధాన దాత రాధామాధవి, మురళీకృష్ణ, రాంబాబు, సత్యనారాయణ, వెంకట్రావు, రాజేశ్వరి, భక్తులు పాల్గొన్నారు. హిందూ చైతన్య వేదిక, చీరాల గో పరిరక్షణ సమితి, శ్రీ వాసవీ మిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో దేవరాజ్‌, డా.శబరీ, గుప్త, వెంకటరావు, సూర్యకుమారి, వరప్రసాద్‌, బాలాజీ, శ్రీనివాస్‌ తదతరులు పాల్గొన్నారు. చీరాల రామాలయం వీధిలో శ్రీకష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని నాదస్వర విద్వాన్‌ నటరాజుకు మహాలక్ష్మమ్మ అమ్మవారి కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కారయక్రమంలో అరుణ్‌కుమార్‌, దాస్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

బల్లికురవ : మండలంలోని పలు గ్రామాలలో శనివారం కృష్ణాష్ణమి పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్లాయపాలెం, ముక్తేశ్వరం, నక్కబొక్కలపాడు, వల్లాపల్లి, సోమవరప్పాడు, చెన్నుపల్లి, వైదన, కొప్పెరపాడు, కొణిదెన గ్రామాలలో పండగ వేడుకలను ఎంతో ఉత్సాహాంగా నిర్వహించారు. కొణిదెనలో ఉన్న కొణిదెన యజ్జనారాయణ మెమోరి యల్‌ గోశాల నందు సేంద్రియ వ్యవసాయ క్షేత్రం ఆవరణలో కృష్ణాష్ణమి సందర్బంగా చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.

పంగులూరు : పంగులూరు ఎస్‌ఆర్‌ఆర్‌. ఖోఖో అకాడమీలో కృష్ణాష్టమి వేడుక శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. అకాడమీలో యువతకు ఉట్టికొట్టే పోటీలు నిర్వహించారు. ఖోఖో అసోషియేషన్‌ రాష్ట్రకార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉట్టికొట్టే పోటీలలో పలువురు ఖోఖో క్రీడాకారులు, వ్యాయామోపాధ్యాయులు పాల్గొని సందడిచేశారు. పోటీలో గెలుపొందిన యువతకు ప్రోత్సాహక బహుమతులందచేశారు. కార్యక్రమంలో పీడీ.షేక్‌ అహమ్మద్‌, సూరినాయుడు, నాగవెంకటశివ దాలినాయుడు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

మార్టూరు : శ్రీకృష్ణాక్షమి వేడుకలను శనివారం మార్టూరులో పడమర బజారున యాదవ్‌ యూత్‌ ఆధ్వర్యంలో యువకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేరింతలు కొడుతూ, యువకులు రంగులు చల్లుకుంటూ, సందడి చేశారు. ఈ సదర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి.

చినగంజాం : మండలంలోని కడవకుదురు గ్రామంలోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆలయ పూజారి ఆధ్వర్యంలో స్వామి వారిని నూతన పట్టువస్త్రాలతో, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలను నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అన్నసంతర్ఫణ నిర్వహించారు. శనివారం రాత్రి నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యాదవ పెద్దలు నక్కల పెదముత్తయ్య, కొండేపి వెంకటేశ్వర్లు నక్కల వెంకటనారాయణ, వడ్లమూడి వెంకటేశ్వర్లు, నక్కల శేషయ్య మందిర కమిటి సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. చినగంజాంలోని శ్రీహనుమసాయి కుటీరం, భూ సమేత భావనారాయణస్వామి దేవస్థానాల్లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. హనుమసాయి కుటీరంలోని సాయిబాబా మందిరంలో శ్రీకృష్ణ స్వామి వారికి విశేష పూజలు జరిపారు. పూజలు అనంతరం అంకిత సాయి భక్తులు భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంతమాగులూరు : మండలంలోని సంతమాగు లూరు, పత్తేపురం, పుట్టావారిపాలెం, ఏల్చూరు, మక్కెనవారిపాలెం, అడపాలెం గ్రామాలలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణ దేవాలయాలలో భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు విశేష పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాలలో ఉట్టి కొట్టుట కార్యక్రమాలు నిర్వహించారు.

భక్తి శ్రద్దలతో కృష్ణాష్టమి వేడుకలు

అద్దంకి : కృష్ణాష్టమిని భక్తులు శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అద్దంకి పట్ఠణంలోని కాకానిపాలెంలో కృష్ణుని మందిరం లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శింగరకొండలోని శ్రీకృష్ణుని దేవాలయం, శింగరకొండపాలెంలోని శ్రీకృష్ణుని వి గ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. హరిహర గోకులానికి రోటరీక్లబ్‌ ఆఫ్‌ శింగరకొండ తరపున శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గోవుల మేత కోసం రూ.9 వేల విలువైన దాణా అందజేశారు. కార్యక్రమంలో తమ్మన శ్రీనివాసరావు, చుండూరి మురళీసుధాకర్‌, గూడా లక్ష్మారెడ్డి, పూర్ణచంద్రరావు హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 02:09 AM