పీఏసీఎస్ చైర్మన్‌గా క్రాంతికుమార్ ప్రమాణం
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:01 PM
తర్లుపాడు పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) చైర్మన్ వెలుగు క్రాంతి కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక కంభం రోడ్డులోని జనసేన నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇమ్మడి కాశీనాథ్ అధ్యక్షతన జరిగింది.
మార్కాపురం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : తర్లుపాడు పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) చైర్మన్ వెలుగు క్రాంతి కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక కంభం రోడ్డులోని జనసేన నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇమ్మడి కాశీనాథ్ అధ్యక్షతన జరిగింది. ముందుగా జరిగిన కార్యక్రమంలో కాశీనాథ్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రజా ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేస్తుందన్నారు. జనసేన పార్టీకి చెందిన వ్యకిని కూడా గౌరవించి సొసైటీ చైర్మన్‌గా నియమించడం ప్రజా ప్రభుత్వానికే చెల్లించదన్నారు. నూతన చైర్మన్ క్రాంతికుమార్ మాట్లాడుతూ పీఏసీఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలందించేందుకు శక్తివంచనలేకుండా పనిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్, పట్టణ పార్లీ అధ్యక్షుడు పఠాన్ ఇబ్రహీంఖాన్, శాసనాల వీరబ్రహ్మం, బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు, జనసేన నాయకులు వెలుగు కాశీరావు, చేతుల శ్రీనివాసులు పాల్గొన్నారు.