గ్రామాల్లోకి కిసాన్ మోర్చా
ABN , Publish Date - Jun 02 , 2025 | 10:59 PM
బీజేపీ కిసాన్ మోర్చాను గ్రామ స్థాయిలలో పటిష్ట పరిచి కమిటీలను నియమించాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. స్థానిక వివేకానంద విద్యాపీఠం పాఠశాలలో ప్రకాశం జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు బొంతల కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు.
రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి
మార్కాపురం వన్‌టౌన్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ కిసాన్ మోర్చాను గ్రామ స్థాయిలలో పటిష్ట పరిచి కమిటీలను నియమించాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. స్థానిక వివేకానంద విద్యాపీఠం పాఠశాలలో ప్రకాశం జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు బొంతల కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కుమారస్వామి మాట్లాడుతూ.. కిసాన్ మోర్చా బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. రైతుల సమస్యలపై కిసాన్ మోర్చా నిరంతరం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సన్నారెడ్డి సురేశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసులు, బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు, ఎస్.సరోజిని, ఎం.లక్ష్మీ, జీవీ రెడ్డి, చిన్నయ్య, సతీష్, శ్రీధర్, కిసాన్ మోర్చా నాయకులు రామకృష్ణారెడ్డి, ఆదినారాయణరెడ్డి, బాదరయ్య, ప్రతా్‌పరెడ్డి, సూర్యనారాయణ, ఉన్నం శీను, పి.నారాయణ పాల్గొన్నారు.