కనిగిరి తహసీల్దార్ రవిశంకర్ సస్పెన్షన్!
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:56 AM
కనిగిరి తహసీల్దార్ రవిశంకర్‌ను సస్పెం డ్ చేస్తూ కలెక్టర్ రాజాబాబు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రవిశంకర్ అడ్డగోలుగా అసైన్‌మెంట్ భూములను వెబ్‌ల్యాండ్‌లో నమో దు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
అడ్‌హక్ ఉద్యోగోన్నతిపై జయలక్ష్మి నియామకం
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కనిగిరి తహసీల్దార్ రవిశంకర్‌ను సస్పెం డ్ చేస్తూ కలెక్టర్ రాజాబాబు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రవిశంకర్ అడ్డగోలుగా అసైన్‌మెంట్ భూములను వెబ్‌ల్యాండ్‌లో నమో దు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒంగోలు ఆర్డీవో విచారణ చేసి అక్రమాలు జరిగినట్లు గుర్తించి నివేదికను ఇచ్చారు. దీంతో తహసీల్దార్ రవిశంకర్‌పై కలెక్టర్ వేటు వేశారు. కనిగిరి తహసీల్దార్‌గా చీమకుర్తి ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న జయలక్ష్మిని అడ్‌హక్ ఉద్యోగోన్నతిపై నియమించారు.