జాతీయస్థాయి ఖోఖో పోటీలకు కనిగిరి విద్యార్థినుల ఎంపిక
ABN , Publish Date - Oct 18 , 2025 | 10:41 PM
జాతీయస్థాయి ఖోఖో పోటీలకు కనిగిరికి చెందిన విద్యార్థినులు ఎం పికైనట్లు ఖోఖో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. భాస్కర్‌రావు, బి.కాశీవిశ్వనాధరెడ్డి శనివా రం తెలిపారు.
కనిగిరి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి ఖోఖో పోటీలకు కనిగిరికి చెందిన విద్యార్థినులు ఎం పికైనట్లు ఖోఖో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. భాస్కర్‌రావు, బి.కాశీవిశ్వనాధరెడ్డి శనివా రం తెలిపారు. ఈనెల 24 నుంచి 26వ వరకు కర్ణాటక రాష్ట్రంలోని దావనగిరిలో జరిగే 31 దక్షిణ భారత ఖోఖో పోటీల్లో రాష్ట్ర జట్టులో కనిగిరికి చెందిన ఏడు గురు విద్యార్థినులు పాల్గొననున్నట్లు తె లిపారు. వీరు గత నాలుగు రోజుల నుం చి కృష్ణాజిల్లా గన్నవరంలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో పాల్గొన్నట్లు తెలిపారు.
ఎంఎన్‌ఎం కళాశాలకు చెందిన యు. నాగమల్లేశ్వరి, ఎం.సఖియా, యు.శశిక ళ, ఎస్.పావని, ఆర్ .యశోద, ఎమ్మెస్సా ర్ కళాశాల నుంచి బి.గుణవతి, పి.అమృత ఎంపిక య్యారు. ఎంపికైన విద్యార్థినులను కళాశాల కరస్పాండెంట్ ఏలూరి సుబ్బారావు, ఎమ్మె స్సార్ కళాశాల ప్రిన్సిపాల్ టి.వెంకటరెడ్డి, అడ్వైజర్ పి.కృష్ణారెడ్డి, ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, సీతారామిరెడ్డి, కోశాధికారి హను మంతరావు, పీడీ కాశీవిశ్వనాధరెడ్డి అభినందించారు.
ఖోఖో అండర్ - 19 బాలికల జట్టు ఎంపిక
వెలిగండ్ల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): విజయన గరం జిల్లాలో వచ్చే నెలలో స్కూల్ గేమ్స్ పోటీలు జరగనున్నాయి. ఖోఖో అండర్ 19 బాలికల జిల్లా జ ట్టును శనివారం వెలిగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాలలో ఎంపికచేశారు. ఈసందర్భంగా స్కూల్ గేమ్స్ కార్యదర్శి చింపారెడ్డి, పీడీలు శంకర్, కాశీవిశ్వనాధ్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో బాలికల జట్టు శిక్షణ శిబిరం కని గిరిలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో హె చ్‌ఎం గౌసియా బేగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.