Share News

కనిగిరి అభివృద్ధే నా అజెండా

ABN , Publish Date - Dec 28 , 2025 | 10:24 PM

కనిగిరి ప్రాం త అభివృద్ధే తన అజెండాగా ముందుకు సాగుతున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో వెలిగండ్ల మండలానికి చెందిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ తది తరులు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. ఈసం దర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ అభివృద్ధిని చూసి వైసీపీని వీడి టీడీపీలో చేరటం శుభపరిణామమ న్నారు.

కనిగిరి అభివృద్ధే నా అజెండా
టీడీపీలో చేరిన వెలిగండ్ల ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, కొటాలపల్లి, అగ్రహారం గ్రామస్థులు

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

వైసీపీని వీడి పలువురు టీడీపీలో చేరిక

కనిగిరి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): కనిగిరి ప్రాం త అభివృద్ధే తన అజెండాగా ముందుకు సాగుతున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో వెలిగండ్ల మండలానికి చెందిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ తది తరులు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. ఈసం దర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ అభివృద్ధిని చూసి వైసీపీని వీడి టీడీపీలో చేరటం శుభపరిణామమ న్నారు. పార్టీలో కొత్త, పాత లేకుండా ప్రతిఒక్కరికి అండగా ఉంటామన్నారు. కనిగిరి ప్రాంత అభివృద్ధి, భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం, వలసల నివారణ కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. కక్ష సాధింపులకు తావు లేకుండా ప్రతిఒక్కరిని కలుపుకుని పోవటమే పార్టీ అజెండా, తన అజెండా అని అన్నారు.

వెలిగండ్లలో వైసీపీకి షాక్‌

వెలిగండ్ల మండలంలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. వెలిగండ్ల మండలాధ్యక్షురాలు రామన లక్షమ్మ, ఉపా ధ్యక్షురాలు ఎర్రబోయిని భారతి, ప్రముఖ న్యాయవాది, మాజీ జడ్పీటీసీ రామన తిరుపతిరెడ్డి, నాగూర్‌యా దవ్‌, కొటాలపల్లి సర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితో పాటు మండలం లోని అగ్రహారం, కొటాలపల్లి గ్రామానికి చెందిన వంద కుటుంబాలకు పైగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈసందర్భంగా టీడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ రా మన తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కనిగిరి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చేస్తున్న కృషి అనిర్వచ నీయమన్నారు. కనిగిరి నియోజకవర్గంలో గత రెండేళ్లుగా జరిగిన అభివృద్ధిని చూస్తే ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర కృషి, ఈప్రాంతంపై మక్కువ అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న వారితో కలసి పనిచేస్తూ టీడీపీ అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు.

కార్యక్రమంలో టీడీపీ వెలిగండ్ల మండల తాజా, మాజీ అధ్యక్షులు ఇంద్రభూపాల్‌రెడ్డి, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, సలోమన్‌రాజు, పల్లాల నారపరెడ్డి, అగ్రహారం, కొటాలపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 10:24 PM