Share News

అట్టహాసంగా కందుల జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Nov 17 , 2025 | 10:41 PM

మార్కాపురం శాసనసభ్యులు కం దుల నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఆయన నివాసంలో అట్టహాసంగా జరిగాయి. అర్థరాత్రి నుంచి ఎమ్మె ల్యే గృహంలో కోలాహలం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, కేకులు కట్‌ చేయించారు.

అట్టహాసంగా కందుల జన్మదిన వేడుకలు
పొదిలిలో కందులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న టీడీపీ నాయకులు

మార్కాపురం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం శాసనసభ్యులు కం దుల నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఆయన నివాసంలో అట్టహాసంగా జరిగాయి. అర్థరాత్రి నుంచి ఎమ్మె ల్యే గృహంలో కోలాహలం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, కేకులు కట్‌ చేయించారు. ఉదయం త్రిపురాంతకంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం 11.00 గంటల నుంచి ఆయన నివాసానికి ని యోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్దఎత్తున చేరుకున్నారు. పూలమాలలు వేసి దుశ్శాలువాలు కప్పి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు, పలువురు పుస్తకాలు, పెన్నులు ఆయనకు గిఫ్ట్‌గా అందించారు. అభిమానులు ప్రత్యేకంగా తయా రు చేయించిన భారీ కేకును ఈ సందర్భంగా కట్‌ చేశారు. అనంతరం అందరికీ స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లిఖార్జున్‌, తాళ్లపల్లి సత్యనారాయణ, మాలపాటి వెంకటరెడ్డి, పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌, వెన్నా పోలిరెడ్డి, సూర పరమేశ్వరరెడ్డి, గొట్టిపాటి సూరి, గుప్తా ప్రసాద్‌, పెరికె సుఖ్‌దేవ్‌, అల్లూరిరెడ్డి, దొడ్డా నాగిరెడ్డి, దియ్యాల వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, అభిమానులు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కూరగాయల మార్కెట్‌లో అన్నదానం

మార్కాపురం వన్‌టౌన్‌ : ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జన్మదినం సందర్భంగా మార్కాపురం కూరగాయల మా ర్కెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ యువ నాయకులు కందుల రోహిత్‌రెడ్డి అన్నదానాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టి.వెంకటరమణ, సయ్యద్‌ కరీం, యక్కలి మల్లిఖార్జున, టీవీఎస్‌ సత్యం, షాబహుద్దూర్‌, కె.శ్రీనివాసులు, షామహ్మద్‌ పాల్గొన్నారు.

పొదిలి : ఎమ్మెల్యే కందుల పుట్టినరోజు వేడుకలను విశ్వనాథపురం, పెద్దబస్టాండ్‌, గునుపూడి భాస్కర్‌ ఇంటివద్ద ఘనంగా నిర్వహించారు. పట్టణంలో విశ్వనాథపురం సెంటర్లో ఏఎంసీ చైర్మన్‌ సమ్యద్‌ ఇమాంమ్‌సాహెబ్‌, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్‌ (పండు), గునుపూడి భాస్కర్‌ ఆధ్వర్యంలో మధ్య నారాయణరెడ్డి పుట్టినరోజు వేడుకలను అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం భాస్కర్‌ పమకూర్చిన చీరలను నిరుపేదలకు ఎమ్మెల్యే పంచిపెట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

త్రిపురాంతకంలో కందుల పూజలు

త్రిపురాంతకం : త్రిపురాంతకంలోని దే వస్థానం ఉభయ దేవాలయాల్లో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పూజలు చేశారు. కార్తీక సోమవారంతోపాటు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వామివారితోపాటు బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి అనిల్‌కుమార్‌ ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆయనతోపాటు మార్కాపురం ఏఎంసీ చైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి, టీడీపీ నేతలు ఉన్నారు.

టీఎన్‌యూఎ్‌ఫ శుభాకాంక్షలు

పెద్దదోర్నాల : తెలుగునాడు ఉపాధ్యా య సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందుల జన్మదిన వేడుకలను ఘనంగానిర్వహించారు. సంఘ గౌరవాధ్యక్షుడు బాలగురువులు అధ్యక్షతన కందులకు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రహమాన్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసు లు, బురానిపీరా, వెంకటేశ్వ ర్లు, ప్రసాద్‌, అశోక్‌రెడ్డి, కొండయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 10:41 PM