ఆలయాల్లో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పూజలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 10:17 PM
త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరీదేవి ఆలయాల్లో గురువారం కమ్మకార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి పూజలు చేశారు.
త్రిపురాంతకం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరీదేవి ఆలయాల్లో గురువారం కమ్మకార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి పూజలు చేశారు. రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉన్న ఆయన ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందిన తరువాత తొలిసారి ఆయన త్రిపురాంతకంలోని ఉభయ దేవాలయాల్లో పూజల్లో పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.