Share News

జూనియర్‌ కాలేజీలు పునఃప్రారంభం

ABN , Publish Date - Jun 03 , 2025 | 01:50 AM

జిల్లాలో అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో ఇంటర్మీడియేట్‌ విద్యా మండలికి అనుబంధంగా నిర్వహిస్తున్న జూనియర్‌ కళాశాలలు వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.

జూనియర్‌ కాలేజీలు పునఃప్రారంభం

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు

ఒంగోలు విద్య, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో ఇంటర్మీడియేట్‌ విద్యా మండలికి అనుబంధంగా నిర్వహిస్తున్న జూనియర్‌ కళాశాలలు వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి కె.ఆంజనేయులు, ఆర్‌ఐవో సైమన్‌ విక్టర్‌ తెలిపారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యామిత్ర పథకం కింద ఉచితంగా పాఠ్య, నోటు పుస్తకాలు అందజేస్తామన్నారు. పుస్తకాలు ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు చేరాయని తెలిపారు. విద్యార్థులు కళాశాలల్లో చేరిన వెంటనే వారికి అందజేసేలా ఏర్పాట్లు చేసినట్లు వారు చెప్పారు.

Updated Date - Jun 03 , 2025 | 01:50 AM