జాబ్‌మేళా పోస్టర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:28 AM
రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన స్థానిక సాయి చైతన్య డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబ్‌మేళా పోస్టర్‌ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
గిద్దలూరు టౌన్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన స్థానిక సాయి చైతన్య డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబ్‌మేళా పోస్టర్‌ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు. 15 బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు హాజరుకానున్నారని, ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.12 నుంచి రూ.20వేల వేతనం ఇవ్వడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎ.రవితేజయాదవ్ ఈసందర్భంగా పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల, 10వ తరగతి నుంచి పిజి వరకు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.