Share News

20న జాబ్‌ మేళా

ABN , Publish Date - Nov 17 , 2025 | 10:42 PM

ఎర్రగొండపాలెం మోడల్‌ డిగ్రీ కాలేజీలో ఈనెల 20వ తేదీన రాష్ట్ర నైపుణ్యాబివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సీడాప్‌ సంయుక్తంగా జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఇన్‌చార్జి గూ డూరి ఎరిక్షన్‌బాబు సోమవారం తెలిపారు.

20న జాబ్‌ మేళా

నిరుద్యోగ యువత వినియోగించుకోవాలి

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఎర్రగొండపాలెం మోడల్‌ డిగ్రీ కాలేజీలో ఈనెల 20వ తేదీన రాష్ట్ర నైపుణ్యాబివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సీడాప్‌ సంయుక్తంగా జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఇన్‌చార్జి గూ డూరి ఎరిక్షన్‌బాబు సోమవారం తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో 9 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. 10 వతరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లమో, ఐటీఐలో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులు 19-30 సంవత్సరంలోపు వయస్సు వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు పాన్‌, ఆధార్‌కార్డు, సర్టిఫికెట్ల జిరాక్సుతో ఇంటర్వ్యూకి హాజరుకావాలని సూచించారు. రూ.13 వేల నుంచి రూ.20వేల జీతం ఉంటుందని తెలిపారు. వివరాలకు స్కిల్‌ హబ్‌ కోఆర్డినేటర్‌ విజయకుమారి 9553945387, 8187084281 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Updated Date - Nov 17 , 2025 | 10:42 PM