Share News

పారిశ్రామిక భూములను పరిశీలించిన జేసీ

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:05 PM

పామూరు మండలంలోని మాలకొండాపురంలో పరిశ్రమల ఏర్పాటుకు సేకరించిన(నిమ్జ్‌) ప్రభుత్వ భూములను జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ గురువారం పరిశీలించారు.

పారిశ్రామిక భూములను పరిశీలించిన జేసీ
నిమ్జ్‌ భూముల రికార్డులను పరిశీలిస్తున్న జేసీ గోపాలకృష్ణ

పామూరు, తర్లుపాడు మండలాల్లో సాగిన పర్యటన

నిమ్జ్‌, బయోగ్యాస్‌ ప్లాంట్‌లకు కేటాయించిన భూముల వివరాలపై ఆరా

త్వరగా క్లియరెన్స్‌ ఇవ్వాలని అధికారులకు ఆదేశం

పామూరు, సెస్టెంబరు 18(ఆంధ్రజ్యోతి) : మండలంలోని మాలకొండాపురంలో పరిశ్రమల ఏర్పాటుకు సేకరించిన(నిమ్జ్‌) ప్రభుత్వ భూములను జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ గురువారం పరిశీలించారు. గతంలో నిమ్జ్‌ కోసం 12 వేల ఎకరాల ప్రభుత్వ భూములు సేకరించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో నిమ్జ్‌ ప్రాజెక్టు కోసం ఏపీఐఐసీ అభ్యర్థన ప్రకారం 856.67 ఎకరాల భూములకు సంబంధించి రికార్డులను పరిశీలించి అడ్వాన్స్‌ పొజిషన్‌ ఇవ్వాలని జేసీ ఆదేశించారు. ఈసందర్భంగా జేసీ గోపాలకృష్ణ మాట్లాడుతూ నిమ్జ్‌ భూ ముల్లో పలు సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకుంటున్నట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుయితేనిరుద్యోగులకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావంగా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కనిగిరి ఆర్డీవో కేశవర్ధనరెడ్డి, తహసీల్దార్‌ ఆర్‌.వాసుదేవరావు, ఆర్‌ఐ ఎస్‌.అజయ్‌కుమార్‌, వీఆర్వో ఎస్‌కే రఫి, ఏపీఐఐసీ జిల్లా మేనేజర్‌ మదన్‌మోహన్‌ పాల్గొన్నారు.

బయోగ్యాస్‌ ప్లాంట్ల భూముల పరిశీలన

మార్కాపురం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రిలయన్స్‌ బయో గ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం గుర్తించిన భూములను జేసీగోపాలకృష్ణ గురువారం పరిశీలించారు. తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు, మంగళకుంట గ్రామాల్లో ఇప్పటికే కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం భూములను గుర్తించారు. కలుజువ్వలపాడు గ్రామంలో సర్వే నెంబర్‌ 86/4లో 150 ఎకరాలు, మంగళకుంట గ్రామంలో సర్వే నెంబర్‌ 195/3, 4, 5 సర్వే నెంబర్లలో 583 ఎకరాలను లీజు పద్ధతిలో కంపెనీకి అప్పగించనున్నారు. ఈ భూములకు సంబంధించి ఇప్పటికే స్థానిక అఽధికారులు అన్ని రికార్డులు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. రెండు గ్రామాల్లో భూములను పరిశీలించిన జేసీ మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. త్వరలోనే భూములను రిలయన్స్‌ కంపెనీకి అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌, తర్లుపాడు తహసీల్దార్‌ కె.కె.కిషోర్‌కుమార్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 11:05 PM