ఉనికి కోసమే జగన్ పాట్లు
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:30 PM
వైసీపీ ఉనికి కోసమే జగన్‌రెడ్డి పడరానిపాట్లు పడుతున్నారని ఎమ్మెల్యే కందుల ఎద్దేవా చేశారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద విలేకరులతో ఆయ న మాట్లాడారు. పొగాకు రైతులను పరామర్శించేందకు వచ్చిన జగన్ ఒక్క నిమిషమైనా రైతులతో మాట్లాడలేదన్నారు.
ఎమ్మెల్యే కందుల
రైతుల కోసం వచ్చి బయ్యర్లను కలిసి వెనక్కి
మహిళలు, పోలీసులపై
వైసీపీ మూకలదాడి అమానుషం
పొదిలి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ఉనికి కోసమే జగన్‌రెడ్డి పడరానిపాట్లు పడుతున్నారని ఎమ్మెల్యే కందుల ఎద్దేవా చేశారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద విలేకరులతో ఆయ న మాట్లాడారు. పొగాకు రైతులను పరామర్శించేందకు వచ్చిన జగన్ ఒక్క నిమిషమైనా రైతులతో మాట్లాడలేదన్నారు. నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరించుకొని బలం నిరూపంచుకునేందుకే ఈ పర్యటన తప్ప, రైతులపై ప్రేమతో కాద న్నారు. అంతే కాకుండా పొగాకు రైతుల పరామర్శపేరుతో పర్యటన పెట్టుకొని అరాచకం సృష్టించారని మండిపడ్డారు. తన చానల్‌లో డిబేట్ ఏర్పాటు చేసి మహిళలను తిడుతుంటే కనీసం జగన్‌రెడ్డి స్పందించలేదన్నారు. జగన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరిన మహిళలపై రాళ్లు, చెప్పులతో దాడికి పాల్ప డడం దుర్మార్గమన్నారు. కేవలం 30 నిమిషాలు బయ్యర్లతో మాట్లాడి వెనుదిరిగారన్నారు. నేను పర్యటనకు వస్తున్నానని ఎమ్మెల్యేలు, మంత్రులు పొగా కు బోర్డును సందర్శించి, కంపెనీ ప్రధినిధులతో మాట్లాడారని జగన్ చెప్పడం అబద్ధమన్నారు. రైతుల కోసం వచ్చి కనీసం వారి సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేయలేదన్నారు. మహిళలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వైసీపీ మూకల దాడిలో గాయపడిన మహిళలను, పోలీస్ సిబ్బందిని ఆయన పరామర్శించారు.
రాళ్ళురువ్విన వారిపై కేసులు నమోదు చేస్తాం
సీఐ వెంకటేశ్వర్లు
జగన్ పర్యటన సందర్భంగా మహిళలపై రాళ్లు రువ్విన వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మాట్లాడుతూ అమరావతి మహిళలను కించపరచడాన్ని ఖండిస్తూ మహిళలు నిరసన తెలిపారు. అదే సమయంలో జగన్‌రెడ్డి వస్తున్నారని తెలుసుకొని జగన్ క్షమాపణ చెప్పాలని పాత పోస్టాఫీస్ వద్ద మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆ సమయంలో వైసీపీ మూకలు మహిళలపై రాళ్లు, చెప్పులను విసిరారని తెలిపారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తామని తెలిపారు.