పర్యటనల పేరుతో అల్లర్లు సృష్టించమే జగన్ లక్ష్యం
ABN , Publish Date - Oct 09 , 2025 | 10:26 PM
పర్యటనల పేరుతో అల్లర్లు సృష్టించ టమే జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి ధ్వజమెత్తారు. ఈమేరకు గురువారం ఓప్రకటన విడుదలచే శారు.
దర్శి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): పర్యటనల పేరుతో అల్లర్లు సృష్టించ టమే జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి ధ్వజమెత్తారు. ఈమేరకు గురువారం ఓప్రకటన విడుదలచే శారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే నష్టమేమిటని కోర్టులు కూడా సమర్ధిస్తున్నప్పటికీ జగన్ అండ్ కో బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు కొరత ఉన్నప్పుడు పీపీపీ విధానం ద్వారా మెడికల్ కళాశాలలు నిర్మించటంవల్ల విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. గత ఐదేళ్లల్లో జగన్ ఒక్క మెడికల్ కళాశాలనైనా నిర్మించారా అని ప్రశ్నిం చారు. కూటమి ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఇంజనీరింగ్ కళాశాల నిర్మించి సామాన్యులకు ఉన్నత విద్య అందేవిధంగా కృషి చేస్తుందన్నారు. కర్ణాటకలో 12 మెడికల్ కళాశాలలు పీపీపీ విధానం ద్వారా నిర్మిస్తున్న విషయం కనిపించటం లేదా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగు తున్న అభివృద్ధిని చూసి దిక్కుతోచక అరాచకాలు సృషించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.