కురిసింది వాన...
ABN , Publish Date - Aug 13 , 2025 | 02:43 AM
జిల్లాలోని తూర్పుప్రాంతంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒంగోలు, కొత్తపట్నం, మద్ది పాడు, ఎన్‌జీపాడు, సంతనూతలపాడు తదితర మండలాల్లో దాదాపు రెండు గంటలపాటు తెరపి లేకుండా పడింది. ఒంగోలు నగరం జలమయమైంది. రోడ్లు చెరువులను తలపించాయి. దాదాపు నెలన్నర రోజులుగా జిల్లాలో సరైన వర్షం లేక పూర్తి బెట్టవాతావరణం, వేసవిని తలపించేలా ఎండలు కాచాయి. రెండు రోజుల నుంచి వాతా వరణంలో మార్పు వచ్చింది. ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడటంతోపాటు అక్కడక్కడా జల్లులు కూడా పడ్డాయి.
తూర్పున భారీ వర్షం
ఒంగోలు జలమయం
చెరువులను తలపించిన రోడ్లు
జిల్లా అంతటా చల్లబడిన వాతావరణం
ఒంగోలు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని తూర్పుప్రాంతంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒంగోలు, కొత్తపట్నం, మద్ది పాడు, ఎన్‌జీపాడు, సంతనూతలపాడు తదితర మండలాల్లో దాదాపు రెండు గంటలపాటు తెరపి లేకుండా పడింది. ఒంగోలు నగరం జలమయమైంది. రోడ్లు చెరువులను తలపించాయి. దాదాపు నెలన్నర రోజులుగా జిల్లాలో సరైన వర్షం లేక పూర్తి బెట్టవాతావరణం, వేసవిని తలపించేలా ఎండలు కాచాయి. రెండు రోజుల నుంచి వాతా వరణంలో మార్పు వచ్చింది. ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడటంతోపాటు అక్కడక్కడా జల్లులు కూడా పడ్డాయి. గత రాత్రి పశ్చిమ ప్రాంతంలోని కొన్ని మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. మంళవారం సాయంత్రం తూర్పుప్రాంతంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఈ ప్రాంతంలో వాతావరణంలో మార్పు వచ్చింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి జల్లులు ప్రారంభమయ్యాయి. నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు ఒంగోలు నగరంతోపాటు పరిసన ప్రాంత మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో మద్దిపాడులో ఏకంగా 90 మి.మీ వర్షపాతం నమోదైంది. అక్కడ ప్రధాన వీధులపై వర్షపు నీరు పారుతూ జనం ఆవస్థ పడ్డారు. అలాగే కొత్తపట్నంలో 69.75మి.మీ, ఒంగోలులో 48.25,. ఎన్‌జీపాడు మండలం వినోదరాయునిపాలెంలో 42.50, సంతనూతలపాడులో 25.75 మి.మీ కురిసింది. దర్శి, కురిచేడు, చీమకుర్తి, సింగరాయకొండ, పొదిలి, టంగుటూరు, జరుగుమల్లి తదితర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. సాయత్రం వేళ అది కూడా దాదాపు రెండు, మూడు గంటలపాటు తెరపిలేకుండా వర్షం కురవడంతో ఒంగోలు నగర ప్రజానీకం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భారీ వర్షంతో నీరంతా రోడ్లుపైకి వచ్చి చెరువులు, కాలువలను తలపించే రీతిలో పారడంతో ప్రధాన రోడ్లలో వాహనాలపై వెళ్ళేవారు ఆవస్థలు పడాల్సి వచ్చింది. చిరు వ్యాపారులు,వీధి వ్యాపారులతో పాటు సాయంత్రం పనులు ముగించుకొని ఇళ్ళకు వెళ్ళే ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు ఇతరత్రా కూడా వర్షంతో ఇక్కట్లు పడ్డారు. ఇదిలా ఉండగా ఒక వైపు రుతుపవనాల ప్రభావం మరో వైపు బంగాళాఖాతంలోఆల్పపీడన ప్రభావంతో వాతావరణంలో ఈమార్పు కపిస్తుండగా మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.