గంజాయి బ్యాచ్‌కు జగన్ అండగా నిలవటం సిగ్గుచేటు
ABN , Publish Date - Jun 03 , 2025 | 10:30 PM
మాజీ సీఎం వైఎస్ జగన్ గంజాయి బ్యాచ్‌కు అండగా నిల వటం సిగ్గుచేటని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ధ్వజమెత్తారు. ఈమేరకు మంగళవారం ఓప్రకటన విడుదలచేశారు. తెనా లిలో పోలీసులపై దాడిచేసిన రౌడిషీటర్లు, గంజాయి స్మగ్లర్లను పరామర్శించటం ఆయన నేర ప్రవృత్తికి నిదర్శనమన్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ధ్వజం
దర్శి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్ జగన్ గంజాయి బ్యాచ్‌కు అండగా నిల వటం సిగ్గుచేటని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ధ్వజమెత్తారు. ఈమేరకు మంగళవారం ఓప్రకటన విడుదలచేశారు. తెనా లిలో పోలీసులపై దాడిచేసిన రౌడిషీటర్లు, గంజాయి స్మగ్లర్లను పరామర్శించటం ఆయన నేర ప్రవృత్తికి నిదర్శనమన్నారు. సైకోలను ప్రోత్సహించి ప్రజావ్యతిరేఖ విధానాలను నిర్వి హంచేందుకు ప్రజలపై ఉసిగొల్పు తున్నారని విమర్శించారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల లో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు విపరీతంగా పెరిగాయన్నారు. వైసీ పీ నాయకుల అండతో మాఫియా సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పా ల్పడి రాష్ర్టాన్ని దోచుకున్నార న్నారు. కళాశాలల్లోనూ గంజాయి విక్రయాలు చేసి యువత, విద్యార్థులను చెడగొట్టే ప్రయత్నం చేశారని ధ్వజమె త్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యా ణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం గతంలో ఎన్నడూలేని విధంగా జరుగుతుందన్నారు. ప్రజారంజక పాలన చూసి ఏమిచేయాలో పాలుపోక వైసీపీ నాయకులు వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ తన వక్రబుద్ధిని మార్చుకోకుంటే ప్రజలు మరోసారి గుణపాఠం చెబు తారని డాక్టర్ లక్ష్మి హెచ్చరించారు.