Share News

మధ్యాహ్న భోజనంలో అవకతవకలు

ABN , Publish Date - Jul 26 , 2025 | 01:24 AM

మార్కాపురం జిల్లా పరి షత్‌ బాలికల హైస్కూలులో మధ్యాహ్న భోజనం అమలులో అవకతవ కలు చోటుచేసుకోవడంపై రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌ అగ్ర హం వ్యక్తం చేశారు. బాధ్యులైన పాఠశాల ప్రధానోపాద్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మధ్యాహ్న భోజనంలో అవకతవకలు
మార్కాపురంలోని జడ్పీ బాలికల హైస్కూల్‌

డైరెక్టర్‌ ఆగ్రహం

హెచ్‌ఎంపై చర్యలకు ఆదేశం

ఒంగోలు విద్య జూలై 25 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లా పరి షత్‌ బాలికల హైస్కూలులో మధ్యాహ్న భోజనం అమలులో అవకతవ కలు చోటుచేసుకోవడంపై రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌ అగ్ర హం వ్యక్తం చేశారు. బాధ్యులైన పాఠశాల ప్రధానోపాద్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్య గుంటూరు ఆర్జేడీని కోరుతూ ఉత్తర్వులు జారీచేశారు. మార్కాపురం జడ్పీ బాలికల హైస్కూలులో మధ్యాహ్న భోజన పథకం అమలులో అవకతవకలు చోటుచేసుకున్నాయి. వీటిని పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ వెలుగులోకి తేవడంతో అక్కడి సబ్‌ కలెక్టర్‌, ఉప విద్యాధికారి, మండల విద్యాధికారి పాఠశాలలను సందర్శించి విచారణ నిర్వహించారు. అందు లో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.. రోజూ హైస్కూలులో 800 మంది విద్యార్థినులు మధ్యాహ్న భోజనం చేస్తారు. వీరికి ఒక్కొక్కరికి రోజుకు 150 గ్రాముల చొప్పున బియ్యం ఇవ్వాల్సి ఉండగా మొత్తం 70 నుంచి 80 కేజీలు మాత్రమే హెచ్‌ఎం ఇస్తున్నారు. ప్రతి విద్యార్థికీ ఒక గుడ్డు చొప్పున 800 గుడ్లను ఇవ్వాల్సి ఉండగా కేవలం 400 గుడ్లు మాత్రమే ఇస్తున్నారు. విద్యార్థినులకు ఇవ్వాల్సిన చిక్కీలలో కూడా కోత పెట్టారు. పాఠశాలలో బియ్యం నిల్వల్లో కూడా భారీగా తేడాలు ఉన్నాయి. మధ్యాహ్నం భోజన స్టాక్‌ రిజిస్టర్‌ ప్రకారం 2510.50 కేజీల బియ్యం నిల్వ ఉండాల్సి ఉండగా 3,725 కేజీలు ఉన్నాయి. రిజిస్టర్‌లో 238 గుడ్లు నిల్వ ఉన్నట్లు పేర్కొనగా అక్కడ 70 ఉంటాన్ని గుర్తించారు. చిక్కీలు కూడా 986కి గాను అదనంగా 889 ఉన్నాయి. మధ్యాహ్న భోజనంకు సంబంధించిన స్టాక్‌ బియ్యం, గుడ్లు, చిక్కీలు విక్రయించగా వచ్చిన రూ.2 లక్షలను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ చేశారు. మధ్యాహ్న భోజన బియ్యం స్టాక్‌ విక్రయించినట్లు హెచ్‌ఎం స్వల్పంగా అంగీకరించినందున సీసీఏ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్జేడీకి డైరెక్టర్‌ లేఖ రాశారు. హెచ్‌ఎం విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై డైరెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మధ్యాహ్నం భోజనంలో అవకతవకలు, అక్రమాలు ఈనెల 14న వెలుగులోకి రాగా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ లేవు.

Updated Date - Jul 26 , 2025 | 01:24 AM