ఉపాధిలో అక్రమాలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 10:48 PM
మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగిన ట్లు సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెల్లడైంది. 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై సామా జిక తనిఖీ బృందం పరిశీలించి వారిదృష్టికి వచ్చిన అక్రమాలను వెల్లడించారు.
పజావేదికలో నివేదించిన సామాజిక తనిఖీ బృందం
పామూరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగిన ట్లు సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెల్లడైంది. 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై సామా జిక తనిఖీ బృందం పరిశీలించి వారిదృష్టికి వచ్చిన అక్రమాలను వెల్లడించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 17వ విడత సామాజిక తనిఖీపై ప్రజావేదిక కార్యక్రమం డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. మండలం లోని 25 గ్రామ పంచాయతీల్లో 714 పనులకుగాను రూ.14 కోట్ల 58లక్షల75వేల321 రూపాయలు ఖర్చు చేశారు. అందులో ఉపాధి కింద 601 పనులకుగాను రూ.7కోట్ల 61లక్షల 59 వేలు, పంచాయతీరాజ్ కింద 113 పనులకు గాను రూ.6 కోట్ల 97లక్షల 15 వేలు ఖర్చు చేశారు.
ప్రజావేదికలో పీడీ జోసఫ్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధి పనులు పాదదర్శకంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం కూలీలతో సమావేశాలు నిర్వహించాలన్నా రు. పని ప్రదేశాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయా లన్నారు. రాబోయే రోజుల్లో వేలిముద్రలు ఉండరాదనే ఉద్దేశంతో ఉపాధి కూలీలను ఉల్లాస్ అక్షరాంధ్ర కింద అక్షరాస్యులను చేయాలన్నారు. కూలీలకు ప్రతి శుక్ర వారం నిర్వహించాల్సి రోజ్‌గార్ దీవస్ ఆవశ్యకత గు రించి వివరించాలన్నారు. మస్టర్లు, రిజిస్ర్టేషన్లు వెరిఫి కేషన్ చేయడంలేదని, కొన్నిచోట్ల సంతకాలు లేకుండానే చెల్లింపులు చేశారని తనిఖీ బృందం వెల్లడించింది. గ్రా మాల్లో రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కలు చాలాచోట్ల చనిపోయాయని తెలిపా రు. దీనిపై స్పందిస్తూ పీడీ మాట్లా డుతూ మొక్కల విషయంలో రాజీ పడరాదన్నారు. మొక్కలు బతికే మా ర్గాన్ని అన్వేషించాలని ఉపాధి సిబ్బందికి సూచించారు.
వగ్గంపల్లిలో అంగన్‌వాడీ ఆయాకు ఉపాధి పనులు కల్పించారని, హార్టి కల్చర్ పనుల్లో తేడాలు ఉన్నాయని సామాజిక తనిఖీ బృందం పేర్కొంది. లబ్ధిదారులకు నగదు ఇవ్వకుండా జాన్ అనే వ్వక్తి ఖాతాకు నగదు బదలాయించారని పేర్కొంది. చెక్ డ్యాం పనులు కూలీలతో చేయించలేదని, పని ప్రదేశాల్లో కూలీలకు కనీస వసతులు సమకూర్చలేదని సామాజిక తనికీ బృందం ఆరోపించింది. పీడీ జోసఫ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాలవారీగా జరిగిన పనుల్లో అక్రమాలను నిగ్గుతేల్చి సంబంధిత వ్యక్తులపై చర్యలతో పాటు రికవరీ చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు యారవ శ్రీనివా సులు, ఎంపీడీవో ఎల్.బ్రహ్మయ్య, కేఎస్‌కే ప్రసాద్, రవికుమార్, బి.మాల్యాద్రి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.