‘జీజీహెచ్‌కి అవినీతి రోగం’పై విచారణ
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:19 AM
ఒంగోలు జీజీహెచ్‌లోని నర్సింగ్ విభాగంలో చోటుచేసుకున్న అవినీతి బాగోతంపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 1న ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. నర్సులకు డ్యూటీలు వేసేందుకు నర్సింగ్ సూపరింటెండెంట్ సాగిస్తున్న వసూళ్ల పర్వంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు.
ప్రారంభించిన త్రిసభ్య కమిటీ
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు జీజీహెచ్‌లోని నర్సింగ్ విభాగంలో చోటుచేసుకున్న అవినీతి బాగోతంపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 1న ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. నర్సులకు డ్యూటీలు వేసేందుకు నర్సింగ్ సూపరింటెండెంట్ సాగిస్తున్న వసూళ్ల పర్వంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. ఇద్దరు హెచ్‌వోడీలు, ఆర్‌ఎంవోతో కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో వారు సోమవారం విచారణ ప్రారంభించారు. నర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న వారిని వేర్వేరుగా విచారించారు. డ్యూటీ రోస్టర్ విధానాన్ని చూశారు. ఈ సందర్భంగానర్సింగ్ సూపరింటెండెంట్ డబ్బులు వసూలు చేస్తున్నది వాస్తవమేనని పలువురు వెల్లడించినట్లు తెలిసింది. అదేసమయంలో తమకు అనుకూలంగా డ్యూటీ వేసినందుకు ఆమెను కాపాడే ప్రయత్నంలో భాగంగా అలాంటిదేమీ లేదని విచారణ అధికారులకు కొందరు చెప్పినట్లు సమాచారం. మంగళవారం కూడా విచారణ కొనసాగనుంది.