Share News

మహిళా మార్ట్‌లో అవినీతిపై నేడు విచారణ

ABN , Publish Date - Oct 07 , 2025 | 01:18 AM

మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలులోని మహిళా మార్ట్‌లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై మంగళవారం విచారణ జరగనుంది. పొదుపు సభ్యుల భాగస్వామ్యం, దాతల సహకారంతో సుమారు రూ.68లక్షల వ్యయంతో రెండేళ్ల క్రితం మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు.

మహిళా మార్ట్‌లో అవినీతిపై నేడు విచారణ

హాజరుకానున్న 30 మందికిపైగా సిబ్బంది

ఒంగోలు కార్పొరేషన్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలులోని మహిళా మార్ట్‌లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై మంగళవారం విచారణ జరగనుంది. పొదుపు సభ్యుల భాగస్వామ్యం, దాతల సహకారంతో సుమారు రూ.68లక్షల వ్యయంతో రెండేళ్ల క్రితం మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. అందులో భారీగా అవినీతి, నగదు దోపిడీ జరిగింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలపై మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ భరత్‌తేజ్‌ స్పందించారు. విచారణ కమిటీని నియమించారు. ఆ మేరకు నెల్లూరుకు చెందిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లీలారాణి బృందం విచారణ ప్రారంభించింది. గత నెలలో ఒంగోలు వచ్చిన విచారణ కమిటీ పలు రికార్డులు స్వాధీనం చేసుకుంది. మంగళవారం చేపట్టబోయే విచారణకు మార్ట్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు నిర్వహణ బాధ్యతలు చూసిన సీఎం ఎంలు, సీవోలు, ఐబీలు, సిబ్బంది హాజరుకావాలని ఆదేశిం చింది. దీంతో మెప్మాలో పనిచేసి బదిలీపై వెళ్లిన వారితోపాటు, ప్రస్తుతం ఉన్న వారిలో 30మందికిపైగా సిబ్బంది ఉదయం 11 గంటలకు ఒంగోలులోని కార్యాలయంలో జరిగేవిచారణకు హాజరు కావాలని పీడీ శ్రీహరి నోటీసులు జారీ చేశారు.

Updated Date - Oct 07 , 2025 | 01:18 AM