వెట్టిచాకిరీపై విచారణ
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:18 PM
తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించడంతో కలెక్టర్ రాజాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివా రం ఆంధ్రజ్యోతిలో చదువుకోసమా.. పనులు చేయడానికా..? అన్న శీర్షికన వచ్చిన కథనంపై అధికారు లు స్పందించారు.
విద్యార్థులతో వంటలు చేయించడంపై
కలెక్టర్ రాజాబాబు ఆగ్రహం
కస్తూర్బాను పరిశీలించిన పీవో
బాలికలతో మాట్లాడిన ఎమ్మెల్యే కందుల
తర్లుపాడు, డిసెంబరు 28 (ఆంధ్రజోతి) : తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించడంతో కలెక్టర్ రాజాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివా రం ఆంధ్రజ్యోతిలో చదువుకోసమా.. పనులు చేయడానికా..? అన్న శీర్షికన వచ్చిన కథనంపై అధికారు లు స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. ఆదివారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలుజువ్వలపాడలోని కస్తూర్బాకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. చదువు కోసం వచ్చిన పిల్లలతో వంట పని చేయించడం ఏమిటని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతో చపాతీలు చేయిస్తున్నారని, రూములను శుభ్రం చేయిస్తున్నారని విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే అక్కడికక్కడే కలెక్టర్ రాజాబాబుతో విద్యార్థినులు ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే తనిఖీ చేయాలని విచారణ అధికారిగా ప్రాజెక్టు అధికారి అనిల్‌కుమార్‌కు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు అధికారి పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులను, ఉపాధ్యాయులను, ప్రిన్సిపాల్‌తో విడివిడిగా మాట్లాడారు. పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి అనిల్ కుమార్ తెలిపారు.