Share News

మెప్మాలో ఆర్పీల అవినీతిపై విచారణ

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:11 AM

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో ఆర్పీల అవినీతి, పొదుపు సభ్యులను మోసం చేసి బోగస్‌ గ్రూపులతో రుణాలు తీసుకోవడంపై అధికారులు స్పందించారు. ‘మళ్లీ బోగస్‌ రుణమోసం’ శీర్షికన ఆంధ్రజ్యోతి శనివారం ప్రచురించిన కథనంపై ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీహరి ఆదేశాల మేరకు సం స్థాగత నిర్మాణం (ఐబీ) స్పెషలిస్ట్‌ ఫణికుమారి విచారణ ప్రారంభించా రు.

మెప్మాలో ఆర్పీల అవినీతిపై విచారణ
కేశవస్వామిపేట పొదుపు సభ్యుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఐబీ స్పెషలిస్ట్‌ ఫణికుమారి

బాధిత పొదుపు సభ్యులతో మాట్లాడిన ఐబీ స్పెషలిస్టు

త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు సిద్ధమైన పీడీ

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ఒంగోలు, కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో ఆర్పీల అవినీతి, పొదుపు సభ్యులను మోసం చేసి బోగస్‌ గ్రూపులతో రుణాలు తీసుకోవడంపై అధికారులు స్పందించారు. ‘మళ్లీ బోగస్‌ రుణమోసం’ శీర్షికన ఆంధ్రజ్యోతి శనివారం ప్రచురించిన కథనంపై ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీహరి ఆదేశాల మేరకు సం స్థాగత నిర్మాణం (ఐబీ) స్పెషలిస్ట్‌ ఫణికుమారి విచారణ ప్రారంభించా రు. ఈ సందర్భంగా స్థానిక చెన్నకేశవస్వామిపేటకు చెందిన గ్రూపుల బాధ్యతలు చూసే ఆర్పీని, మోసపోయిన పొదుపు మహిళలను పిలి పించి విచారణ చేశారు. ఈ సందర్భంగా యానాది సామాజికవర్గానికి చెందిన పొదుపు మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని పీడీ ఎదుట వివరించారు. తమ పేరుతో రుణాలు తీసుకోవడంతో బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. అలాగే బెదిరింపులకు పాల్పడిన ఆర్పీని తమ గ్రూపు బాధ్యతల నుంచి తొలగించి,తమలో చదువుకున్న వారిలో ఒకరిని నియమించాలని కోరారు. దీనిపై రాతపూర్వకంగా పొదుపు సభ్యులు పీడీకి వివరించారు. బోగస్‌ గ్రూపుల పేరుతో నగరంలో భారీగా బ్యాంకుల నుంచి రుణాల పొందిన వాటిపైనా పీడీ లోతుగా విచారణ చేయించేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ముగ్గురు ఉద్యోగులతో త్రిసభ్య కమిటీని నియమించనున్నారు. బ్యాంకుల వారీగా ఈ మూడు నెలల్లో తీసుకున్న రుణాల వివరాలను సేకరించి నకిలీ గ్రూపులను గుర్తించనున్నట్లు తెలిసింది.

Updated Date - Apr 27 , 2025 | 01:11 AM