‘మహిళా మార్ట్ మూత’పై విచారణ ప్రారంభం
ABN , Publish Date - Sep 21 , 2025 | 02:44 AM
ఒంగోలులో నిర్వహి స్తున్న మహిళామార్ట్‌లో అవినీతిపై ఈనెల 3న ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనంపై మెప్మా ఎండీ భరత్‌తేజ్ స్పందించారు. విచారణకు ఆదేశించారు. నెల్లూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లీలా రాణితోపాటు, నెల్లూరు మెప్మా ఏవో, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన నలుగురు అధికారులను విచారణ అధికారులుగా నియమించారు.
రికార్డులు స్వాధీనం చేసుకున్న విచారణాధికారులు
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో నిర్వహి స్తున్న మహిళామార్ట్‌లో అవినీతిపై ఈనెల 3న ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనంపై మెప్మా ఎండీ భరత్‌తేజ్ స్పందించారు. విచారణకు ఆదేశించారు. నెల్లూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లీలా రాణితోపాటు, నెల్లూరు మెప్మా ఏవో, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన నలుగురు అధికారులను విచారణ అధికారులుగా నియమించారు. వారు శనివారం ఒంగోలు వచ్చి విచారణ ప్రారంభించారు. మార్ట్ ప్రారంభమైనప్పటి నుంచి మూసివేసిన తేదీ వరకు సరుకుల కొనుగోలు, రోజువారీ అమ్మకాలు, లాభనష్టాలతోపాటు, ఇతర బ్యాంకు ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. క్రయ విక్రయాలు, బ్యాంకుల్లో జమ చేయడం వంటి అంశాలపె క్షేత్రస్థాయిలో విచారణ చేయనున్నారు. దీంతో మార్ట్ అవినీతిలో భాగస్వాములైన వారిలో కలవరం మొదలైంది. ఇదిలా ఉండగా పొదుపు సభ్యులు మార్టు కోసం చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు ఆర్పీలు విచారణ అధికారులకు వినతి పత్రం అందజేశారు.