ఎస్సీ బాలికల వసతిగృహంలో విచారణ
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:23 AM
చీమకుర్తి లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో బుదవారం డి ప్యూటీ కలెక్టర్, జిల్లా మైనా ర్టీ సంక్షేమశాఖ అధికారి పార్ధసారథి విచారణ జరి పారు.
చీమకుర్తి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : చీమకుర్తి లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో బుదవారం డి ప్యూటీ కలెక్టర్, జిల్లా మైనా ర్టీ సంక్షేమశాఖ అధికారి పార్ధసారథి విచారణ జరి పారు. ఇటీవల హాస్టల్‌లో బాలిక జుట్టు కత్తిరించిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మా దిగ సంక్షేమ పోరాటసమితి అధ్యక్షుడు సుజన్‌మాదిగ ఫిర్యాదు మేరకు విచా రణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు విచారణాధికారిని కలిసిన సంఘటనా బాధ్యులు, వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. తన విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆయన తెలిపారు. కా ర్యక్రమంలో చప్పిడి వెంగళరావు, జె.ఆంజనేయులు, పేరం శ్రీనివాసరావు, చిం తలపాలెం యలమందబాబు తదితరులు పాల్గొన్నారు.