Share News

విశ్రాంత తహసీల్దార్‌పై విచారణ

ABN , Publish Date - Aug 30 , 2025 | 02:35 AM

బేస్తవారపేట మండల తహసీల్దార్‌గా 2020వ సంవత్సరంలో పనిచేసి రిటైర్‌ అయిన నిమ్మరాజు వెంకటేశ్వర్లు అక్రమాలపై విచారణ చేయాలని కలెక్టర్‌ అన్సారియాకు శుక్రవారం ఉత్తర్వులు అందాయి.

విశ్రాంత తహసీల్దార్‌పై విచారణ

కలెక్టర్‌కు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నుంచి ఉత్తర్వులు

బేస్తవారపేట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి) : బేస్తవారపేట మండల తహసీల్దార్‌గా 2020వ సంవత్సరంలో పనిచేసి రిటైర్‌ అయిన నిమ్మరాజు వెంకటేశ్వర్లు అక్రమాలపై విచారణ చేయాలని కలెక్టర్‌ అన్సారియాకు శుక్రవారం ఉత్తర్వులు అందాయి. మండలంలోని పెద్ద ఓబినేనిపల్లె గ్రామ సర్వే నంబర్‌ 18/1లో 5 ఎకరాల అసైన్డ్‌ భూమికి సంబంధించి పట్టాదారును తొలగించి తహసీల్దార్‌ కుటుంబంలో ఒకరికి అక్రమంగా పాసు పుస్తకం ఇచ్చారు. అడంగల్‌, 1బీలో పేరు నమోదు చేయించారు. దీనిపై లోకాయుక్తలో కేసు నమోదైంది. ఈమేరకు విశ్రాంత తహసీల్దార్‌ నిమ్మరాజు వెంకటేశ్వర్లుపై విచారణ నిర్వహించాలని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.జయలక్ష్మి నుంచి శుక్రవారం కలెక్టర్‌కు ఉత్తర్వులు వచ్చాయి

Updated Date - Aug 30 , 2025 | 02:35 AM