సాంకేతిక వ్యవసాయానికి శ్రీకారం
ABN , Publish Date - Aug 28 , 2025 | 10:52 PM
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చు ట్టిందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చు ట్టిందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని దిగువమెట్ట తాండాలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తాండాలో వెనుకబడిన వా రికి శ్రీరామ కిసాన్ ఎఫ్‌ఎంబీ గ్రూప్ కన్వీనర్ కాట్రావత్ మాదవ్‌నాయక్, వారి గ్రూపు సభ్యులకు 80శాతం రాయితీపై కిసాన్ డ్రోన్‌ను సమకూర్చగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి డ్రోన్‌ను పంపిణీ చేశారు. అ నంతరం పొలంలో డ్రోన్‌ను ఆపరేట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని యవతకు ఉపాధి కల్పన, వ్యవసాయ రంగం లో సాంకేతికతకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. యువతకు వ్యవసాయ యాంత్రీకరణపై శిక్షణ ఇచ్చి రోబో డ్రోన్‌ను 10లక్షల విలువ చేసే డ్రోన్‌ను 2లక్షలకు అందచేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.