Share News

బస్సుల్లో ముమ్మర తనిఖీలు

ABN , Publish Date - Oct 26 , 2025 | 01:00 AM

కర్నూలులో బస్సు ప్రమాదం నేపథ్యంలో పోలీసు, రవాణా శాఖ అధికారులు కదిలారు. జిల్లావ్యాప్తంగా శుక్ర, శనివారాలు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్‌ల లైసెన్స్‌లు, బస్సుల్లోని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

బస్సుల్లో ముమ్మర తనిఖీలు
స్కూల్‌ బస్సులో అగ్నిమాపక పరికరాలను పరిశీలిస్తున్న ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, సిబ్బంది

కర్నూలు ఘటన నేపథ్యంలో అప్రమత్తం

12 కేసులు నమోదు చేసిన రవాణా శాఖ

65 వాహనాలను సోదా చేసిన పోలీసులు

ఒంగోలు క్రైం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : కర్నూలులో బస్సు ప్రమాదం నేపథ్యంలో పోలీసు, రవాణా శాఖ అధికారులు కదిలారు. జిల్లావ్యాప్తంగా శుక్ర, శనివారాలు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్‌ల లైసెన్స్‌లు, బస్సుల్లోని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన తనిఖీలలో 12 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆర్‌.సుశీల తెలిపారు. రెండు బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు లేవని, ఒక బస్సులో ప్యాసింజర్‌ లిస్టు లేదని, మరో తొమ్మిది బస్సులకు మెరుపు లైట్లు వినియోగిస్తు న్నందున కేసులు నమోదు చేశామని చెప్పారు. తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి ఒంగోలులో 65 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేసి వారిని హెచ్చరించి పంపించామన్నారు. శనివారం కూడా సోదాలను కొనసాగిం చారు. డీటీసీ సుశీల ట్రావెల్స్‌ బస్సులను, పోలీసులు స్కూల్‌ బస్సులను తనిఖీ చేశారు.

Updated Date - Oct 26 , 2025 | 01:00 AM