Share News

పీహెచ్‌సీల తనిఖీ

ABN , Publish Date - Sep 11 , 2025 | 01:26 AM

జిల్లాలో ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుతున్న వైద్యసేవలపై కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా దృష్టి సారించారు. ఆమె ఆదేశాలతో మండల ప్రత్యేకాధికారులు రంగంలోకి దిగారు. బుధవారం జిల్లాలోని 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. స్వయంగా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ముండ్లమూరులోని పీహెచ్‌సీని తనిఖీ చేయడంతోపాటు అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

పీహెచ్‌సీల తనిఖీ
ముండ్లమూరు పీహెచ్‌సీలో రోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

కలెక్టర్‌ ఆదేశాలతో మండలాలకు తరలిన ప్రత్యేక అధికారులు

రికార్డుల పరిశీలన, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా

ముండ్లమూరు పీహెచ్‌సీని పరిశీలించిన కలెక్టర్‌ అన్సారియా

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుతున్న వైద్యసేవలపై కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా దృష్టి సారించారు. ఆమె ఆదేశాలతో మండల ప్రత్యేకాధికారులు రంగంలోకి దిగారు. బుధవారం జిల్లాలోని 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. స్వయంగా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ముండ్లమూరులోని పీహెచ్‌సీని తనిఖీ చేయడంతోపాటు అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించింది. పీహెచ్‌సీలకు అవసరమైన సదుపాయాలు కల్పించ డంతోపాటు మందులను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు వైద్య సేవలపై ఇటీవల ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యసేవల పట్ల వారిలో అసంతృప్తి ఉన్నట్లు వెల్లడైంది. ఇతర జిల్లాలతో పోల్చితే మన జిల్లాలో ఐవీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వైద్యసేవలపై ఎక్కువ వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషయంపై కలెక్టర్‌ తమీమ్‌ అన్సారి యాతో ఉన్నతాధికారులు మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఆమె అన్ని పీహెచ్‌సీలను తనిఖీ చేసి సమగ్ర నివేదికలను అందజేయాలని మండల ప్రత్యేకాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పీహెచ్‌సీలను పరిశీలించిన వారు ఆ సమయంలోనే వైద్యసేవలకు వచ్చిన ప్రజలు, రోగుల నుంచి వివరాలను సేకరించినట్లు తెలిసింది.

Updated Date - Sep 11 , 2025 | 01:30 AM