Share News

బయోగ్యా్‌స ప్లాంట్‌కు కేటాయించిన భూముల పరిశీలన

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:12 PM

పీసీపల్లి మండలంలోని దివాకరపల్లి సమీపంలో రిలయన్స్‌ కంప్రై్‌సడ్‌ బయోగ్యా్‌సకు అవసరమైన భూములను కనిగిరి ఆర్డీవో జీ కేశవర్దన్‌రెడ్డి బుధవారం పరిశీలించారు.

బయోగ్యా్‌స ప్లాంట్‌కు కేటాయించిన భూముల పరిశీలన

చింతగంపల్లిలో ఆర్డీవో పర్యటన

పీసీపల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని దివాకరపల్లి సమీపంలో రిలయన్స్‌ కంప్రై్‌సడ్‌ బయోగ్యా్‌సకు అవసరమైన భూములను కనిగిరి ఆర్డీవో జీ కేశవర్దన్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. బయోగ్యా్‌సగా అవసరమైన గడ్డిని పెంచేందుకు భూములు అవసరం రావటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్‌ సీహెచ్‌ ఉషా చింతగంపల్లి, నేరేడుపల్లి, గుంటుపల్లి, పెద వీర్లపాడు రెవెన్యూ పరిధిలో 1611.24 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. ఆ భూములకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. తహసీల్దార్‌ గుర్తించిన భూములను పరిశీలించేందుకు ఆర్డీవో చింతగంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ రెవెన్యూ అధికారులు గుర్తించిన భూములను పరిశీలించిన ఆయన భూమి స్వభావాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌వో రఫీ పాల్గొన్నారు.

రికార్డులను తనిఖీ చేసిన ఆర్డీవో

కనిగిరి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : సాధారణ పరిశీలనలో భాగంగానే రికార్డులను తనిఖీ చేస్తున్నట్లు ఒంగోలు ఆర్డీవో కళావతి చెప్పారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం ఆమె మూడు నెలలకు సంబంధించిన మ్యుటేషన్‌ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఆరునెలలకోమారు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా కనిగిరి మండలంలో మూడు నెలలుగా చేపట్టిన మ్యుటేషన్‌ ఆన్‌లైన్‌ వాటి ఫైళ్లను పరిశీలించామన్నారు. అదేవిధంగా ఈ ప్రక్రియ గురువారం కూడా కొనసాగించనున్నట్లు చెప్పారు. పరిశీలించిన రికార్డులలో ఏదైనా లోపాలు జరిగితే వాటిని సవరిస్తామన్నారు. అక్రమంగా మ్యుటేషన్‌లపై నివేదిక కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెలిగండ్ల తహసీల్దార్‌ ఎన్‌ వాసు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:12 PM