కల్వర్ట్ పనుల పరిశీలన
ABN , Publish Date - Jun 25 , 2025 | 10:14 PM
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ రమణబాబు, ఇంజనీరింగ్ అధికారులు ఆకస్మికంగా పరిశీలించారు. పనులు నాణ్యంగా, వేగంగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
గిద్దలూరు, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ రమణబాబు, ఇంజనీరింగ్ అధికారులు ఆకస్మికంగా పరిశీలించారు. పనులు నాణ్యంగా, వేగంగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. క్లబ్ రోడ్డు చివరిలో జరుగుతున్న కల్వర్టు పనిని పరిశీలించారు. ఎక్కువ రోజులు పనులు చేస్తూ కూ ర్చుంటే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది కావున పనులు వేగవంతంగా చేయాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యంగా ఉండాలని, లేకపోతే చర్యలు తప్పవని రమణబాబు కాంట్రాక్టర్లకు సూచించారు. నల్లబండ బజారులో, ప్రశాంత్ నగర్‌లో, ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు వీధుల్లో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్లను పరిశీలించారు. సిమెంటు రోడ్లపై తప్పనిసరిగా మట్టితో కట్టలు కట్టి నీటిని నింపాలని సూచించారు. కనకదుర్గమ్మ దేవాలయం వీధిలో రోడ్లను కూడా పరిశీలించారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆయన వెంట ఉన్నారు.