రాష్ట్రంవైపు పారిశ్రామికవేత్తల చూపు
ABN , Publish Date - Nov 17 , 2025 | 10:38 PM
విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో 13.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదరటంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో 13.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదరటంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఓప్రకటన విడుదలచేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సారథ్యంలో ప్రజా ప్రభుత్వం సమర్థవంతమైన సుపరిపాలన సాగిస్తుంద న్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఐటీ శాఖమంత్రి నారా లోకేష్ చొరవతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని వివరించారు.
రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్న విషయాన్ని జీర్ణించుకోలేక వైసీపీ సైకో బ్యాచ్ అర్థంలేని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్ర భుత్వం హయాంలో ఒక్క రూపాయి కూడా పెట్టుబ డులు తీసుకురాలేని నాటి అసమర్థ పాలకులు ఇప్పుడు అసమర్థమైన ఆరోపణలు చేయటం శోచనీయమన్నా రు. ప్రజలు అన్నీ విషయాలు గమనిస్తున్నారని, భవి ష్యత్తులో వారికి తగిన గుణపాఠం చెబుతారని డాక్టర్ లక్ష్మి స్పష్టం చేశారు.