Share News

వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పరార్‌

ABN , Publish Date - Aug 07 , 2025 | 10:26 PM

వైసీపీ పాలనలో పారిశ్రామిక వేత్తలు పారిపోయారని, దాంతో యువతకు ఉద్యోగాలు, ఉపాధి కరువయ్యాయని టీడీ పీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు అ న్నారు. స్థానిక బట్టు విద్యా సంస్థల ఆవరణలో ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో గురువారం మెగా జాబ్‌మేళాను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం గా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పరార్‌
జాబ్‌మేళాలలో ఎరిక్షన్‌బాబు

జాబ్‌మేళాలలో ఎరిక్షన్‌బాబు

పెద్ద దోర్నాల, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో పారిశ్రామిక వేత్తలు పారిపోయారని, దాంతో యువతకు ఉద్యోగాలు, ఉపాధి కరువయ్యాయని టీడీ పీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు అ న్నారు. స్థానిక బట్టు విద్యా సంస్థల ఆవరణలో ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో గురువారం మెగా జాబ్‌మేళాను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం గా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో వైసీపీ నేతలు ఇంజనీరింగ్‌ కాలేజీలకు వెళ్లి విద్యార్థులతో లెక్కలేనన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదన్నారు. అంతేకాకుండా పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చే పారిశ్రామిక వేత్తలను భయపెట్టి వారు పరారయ్యేలా చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటా 5 లక్షల మందికి చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే 16 వేలకు పైగా మెగాడీఎస్సీని ప్రకటించారన్నారు. 11 కంపెనీల ఆధ్వర్యంలో జరిగిన జాబ్‌ మేళాలో 124 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. 80 మంది ఉ ద్యోగాలకు ఎంపికైనట్లు బట్టు విద్యా సం స్థల చైర్మన్‌ రమణారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డీఈవో రమాదేవి, ఎంఈవో మస్తాన్‌ నాయక్‌, సొసైటీ అధ్యక్షుడు బట్టు సుధాకర్‌ రెడ్డి, కళాశాలల చైర్మన్‌ బట్టు రమణారెడ్డి, టీడీపీ నాయకులు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య,వెచ్చా హరగోపాల్‌, చంటి, కే సుబ్బారెడ్డి, షేక్‌ మంజూర్‌ బాషా, ఇస్మాయిల్‌, మౌలాలి, జంగిలి పిచ్చయ్య పాల్గొన్నారు

మీ పాలనంతా కల్తీ మద్యం,

ఇసుక దోపిడీ, అవినీతి

అభివృద్ధి చేతగాని మీరా ఆరోపణలు చేసేది

ఎమ్మెల్యే చంద్రశేఖర్‌పై ఎరిక్షన్‌బాబు ఆగ్రహం

దొంగల పార్టీ పాలనలో కల్తీ మద్యం అమ్మకాలు చేసి, వచ్చిన సొమ్ముతో నియోజవర్గంలో ఖర్చు పెట్టి గెలిచిన మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రిపై విమర్శలు చేయడమేంటని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని అమానిగుడిపాడులో పలు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చంద్ర శేఖర్‌ ఆరోపణలు, విమర్శలను గూడూరి ఖండించారు. కల్తీ మద్యంతో రాష్ట్రంలో 30వేల మంది ప్రాణాలు బలిగొన్నది వైసీపీ నేతలు కాదా అన్నారు. పేదల డబ్బుతో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి అవినీతి ఆరోపణలపై జైలుపాలైనది మీ నేత కారా అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు జైలులో ఉన్నదానిని మరిచి అధినేత మెప్పు కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజ లు ఊరుకోరన్నారు. మీ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి చేతగాని మీరు విమర్శలు చేయడం సరికాదన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం కాదు.. నిరూపించాలని ఎమ్మెల్యేకు ఎరిక్షన్‌బాబు సవాల్‌ విసిరారు. సమావేశంలో ఎంఎసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, పుల్లలచెరువు మండల అధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌, సీనీయర్‌ నాయకులు వేగినాటి శ్రీను, వెంగళరెడ్డి, శనగ నారాయణరెడ్డి, సుబ్బారెడ్డి, అంజయ్య, కంచర్ల సత్యనారాయణగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 10:26 PM