Share News

సాగర్‌ కాలువలకు పెరిగిన నీటి పరిమాణం

ABN , Publish Date - Nov 15 , 2025 | 01:12 AM

సాగర్‌ కాలువలకు నీటి పరిమాణం పెరిగింది. ప్రస్తుతం కుడి కాలువకు డ్యామ్‌ నుంచి పదివేల క్యూసెక్కుల నీరు విడుదలవు తుండగా బుగ్గవాగుకు చేరుతోంది. బుగ్గవాగు నుంచి సాగర్‌ ప్రధాన కాలువకు 9,620 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.

సాగర్‌ కాలువలకు పెరిగిన నీటి పరిమాణం
ఒంగోలు బ్రాంచ్‌ కాలువలో ప్రవహిస్తున్న సాగర్‌ జలాలు

జిల్లాకు 2,406 క్యూసెక్కులు సరఫరా

దర్శి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): సాగర్‌ కాలువలకు నీటి పరిమాణం పెరిగింది. ప్రస్తుతం కుడి కాలువకు డ్యామ్‌ నుంచి పదివేల క్యూసెక్కుల నీరు విడుదలవు తుండగా బుగ్గవాగుకు చేరుతోంది. బుగ్గవాగు నుంచి సాగర్‌ ప్రధాన కాలువకు 9,620 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. అందులో గుంటూరు బ్రాంచ్‌ కాలువకు 2,200 క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచ్‌ కాలు వకు 1,430 క్యూసెక్కులు, సాగర్‌ ప్రధాన కాలువ 85/3వ మైలుకు (ప్రకాశం సరిహద్దు) 2,406 క్యూసెక్కులు వస్తోంది. అంతకుముందు జిల్లాలోని సాగర్‌ కాలువలకు తక్కువగా నీరు విడుదలవుతుండ టంతో మేజర్లు, మైనర్లకు అందక ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సాగునీటి సమస్యను వివరిస్తూ కొద్దిరోజుల క్రితం ‘అరకొరతో అయోమయం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ఇరిగేషన్‌ అధికారులు స్పందించారు. జిల్లాకు నీటి పరి మాణాన్ని కొంతమేరకు పెంచారు. జిల్లాకు విడుదలవు తున్న నీటిని దర్శి బ్రాంచ్‌ కాలువ పరిధిలోని రైతులు వాడుకోగా మిగిలిన నీరు పమిడిపాడు బ్రాంచ్‌ కాలు వకు 420 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్‌ కాలువ (ఓబీసీ)కు 705 క్యూసెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు మరికొంత నీరు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చివరి ఆయకట్టు భూముల్లో ముమ్మరంగా వరినాట్లు వేస్తున్నారు. ఓబీసీకి వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికీ ఎగువ ప్రాంత రైతులు వాటాకంటే అధికనీరు వాడుకుంటున్నారు. కుడి కాలువకు గరిష్ఠంగా నీరు విడుదల అవుతున్నప్పటీకీ ఎగువ ప్రాంత రైతులు అధికంగా వాడుకోవడంతో ఇంకా కోటా ప్రకారం చివరి ప్రాంతాలకు అందటం లేదు. ఈవిషయాన్ని గుర్తించి అధికారులు ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు మరింత నీటి పరిమాణం పెంచాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 15 , 2025 | 01:12 AM