అసంపూర్తిగా ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మతులు
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:58 PM
పంగులూరు, తూర్పు కొప్పెరపాడు గ్రామాల మధ్య ఆర్ అండ్‌బీ రోడ్డు మరమ్మతు పనులు అర్ధంతరంగా నిలిపి వేశారు. ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డుకు ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు మూడు నెలల కిందట చేపట్టిన మరమ్మతు పనులు అసంపూర్తిగా నిలిచి పోవడంతో ప్రజలు రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నారు.

పొడి కంకరపై ప్రయాణం చేయలేక అవస్థలు
ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు
ఇదీ పంగులూరు, తూర్పు
కొప్పెరపాడు మధ్య రహదారి పరిస్థితి
పంగులూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : పంగులూరు, తూర్పు కొప్పెరపాడు గ్రామాల మధ్య ఆర్ అండ్‌బీ రోడ్డు మరమ్మతు పనులు అర్ధంతరంగా నిలిపి వేశారు. ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డుకు ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు మూడు నెలల కిందట చేపట్టిన మరమ్మతు పనులు అసంపూర్తిగా నిలిచి పోవడంతో ప్రజలు రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నారు. బీటీ, రోడ్డుకు ఏర్పడిన గుంటలు సరి చేసేందుకు ఎక్స్‌కవేటర్‌తో పైభాగం మొత్తం లేపేసి తారు వేసేందుకు కంకర పరిచారు. ఈకంకరపై డస్ట్‌వేసి నీటితో తడిపి చదు ను చేయకుండా పనులు నిలిపేశారు. పొలం పనులకోసం నిత్యం రాకపోకలు సాగించే తూర్పు కొప్పెరపాడు, పంగులూరు గ్రామాల రైతులు, వ్యవసాయ కూలీలు మండల కేంద్రానికి పలు పనుల నిమిత్తం వెళ్లే వారి బాధలు వర్ణణాతీతం. నెలల తరబడి పనులు నిలిచి పోవడం, పొడి బారిన కంకరపై వే గంగా నడిచే వాహనాల తాకిడికి రోడ్డును కమ్మేస్తు న్న దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల వేగానికి చెదిరిన కంకర రాళ్లు చెదిరి పడి గాయాలపాలవుతున్నారు. ద్విచక్ర వాహన చోదకులు వాహనాలు పట్టీ కొట్టి ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు అనేకం రోజూ జరుగుతు న్నాయి. ప్రజలు తాము పడుతున్న ఇబ్బందులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు విన్నవించగా, నిలిచిన మరమ్మతు పనులు తక్షణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించి నెలలు గడుస్తున్నా పురోగతి లేని పరిస్థితి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు సాగించలేక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని నిలిచిన రోడ్డు మరమ్మతు పనులను తక్షణమే పూర్తి చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు.