Share News

కనిగిరి అభివృద్ధిలో.. అధికారులు భాగస్వామ్యం కావాలి

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:41 PM

కనిగిని అభివృద్ధి లో అధికారులు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరా వతి గ్రౌండ్స్‌ సమావేశపు హాలులో మంగళవారం నియోజకవర్గస్థాయి వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కనిగిరి అభివృద్ధిలో..   అధికారులు భాగస్వామ్యం కావాలి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, జూలై 22(ఆంధ్రజ్యోతి): కనిగిని అభివృద్ధి లో అధికారులు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరా వతి గ్రౌండ్స్‌ సమావేశపు హాలులో మంగళవారం నియోజకవర్గస్థాయి వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కనిగిరి ప్రాతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదిక తయారుచేయాలని సూచించారు. వర్షాల పడుతున్న ఈ తరుణంలో పారిశుధ్యంపై దృష్టి సారించాలన్నారు. పారిశుధ్య కార్మికులు కొరవడిన ప్రదేశాల్లో రోజువారీ కూలీల ద్వారానైనా పారిశుధ్య పనులు చేయించాలన్నారు. తద్వార ప్రజలకు పారి శుధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచిం చారు. చెత్త కుప్పల్లో వర్షాల కారణంగా దోమలు ప్రబలి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. చెత్తకుప్పలను ఎప్పటికప్పుడు తొలగించి బ్లీచింగ్‌, ఫాగింగ్‌ చేయాలని ఆదేశించారు. రైతాంగ సమస్యలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ అధికారులు మరింత చొరవచూపాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిదులు అవసరమో గుర్తించి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మంచినీటి వసతి, సరఫరాపై అధికారు లు దృష్టి సారించాలన్నారు. వర్షాల కారణంగా సాగర్‌ నీరు కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. నీటిని శుద్ధిచేసి ప్రజలకు సరఫరా చేయాలని ఆదేశించారు.

వైద్యశాఖ పరిధిలోని డాక్టర్‌లు పీహెచ్‌ సీల్లో అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల కు సత్వర వైద్య సేవలు అందించేందుకు వైధ్యాదికారులు కృషి చేయాలన్నారు. వైద్యప రంగా ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సంబం ధిత వైద్యాధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదన్నారు. ప్రతి ప్రభుత్వశాఖ పరిధిలో అభివృద్ధి ప్రణా ళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. తద్వారా కనిగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్ళి అవ సరమైన నిధులు సమీకరణకు తన వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ విశ్వనాథరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి, డిప్యూటీ డీఎం హెచ్‌వో డాక్టర్‌ సృజన, ఎంఈవో యూవీ నారాయణ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:41 PM