Share News

మ్యాజిక్‌ డ్రైన్లతో పారిశుధ్యం మెరుగు

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:05 PM

మ్యాజిక్‌ డ్రైన్‌ల నిర్మాణంతో గ్రామంలో పారిశుధ్యం మెరుగవుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు.

మ్యాజిక్‌ డ్రైన్లతో పారిశుధ్యం మెరుగు
పెద్ద నాగులవరం గ్రామంలో మ్యాజిక్‌ డ్రైన్‌కు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే కందుల, డ్వామా పీడీ జోసఫ్‌ కుమార్‌, అధికారులు

ఎమ్మెల్యే కందుల

మార్కాపురం రూరల్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మ్యాజిక్‌ డ్రైన్‌ల నిర్మాణంతో గ్రామంలో పారిశుధ్యం మెరుగవుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని పెద్దనాగులవరం గ్రామంలో బుఽధవారం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న మ్యాజిక్‌ డ్రైన్‌ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని డ్వామా పీడీ జోసఫ్‌ కుమార్‌, అధికారులతో కలిసి ఎమ్మెల్యే చేశారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మ్యాజిక్‌ డ్రైన్‌ల వలన భూమిలోకి నీరు ఇంకిపోతుందన్నారు. దాని వలన భూగర్బ జలాలు పెరిగి నీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో ఇళ్ల వద్ద మురుగు సమస్యలు లేకుండా చేసుకోవచ్చునని కందుల తెలిపారు.

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన పిడి

పెద్దనాగుల వరం గ్రామం పరిధలో కొండపై డ్వామా పీడీ జోసఫ్‌ కుమార్‌ కొండపై మొక్కలు నాటాడు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఏపీవో నాగరాజు, ఈసీ కిషోర్‌కుమార్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బంది టీఏలు, పీల్డ్‌ అసిస్టెంట్‌లు, టీడీపీ గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 11:05 PM