Share News

కొండపి సీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు

ABN , Publish Date - Jun 25 , 2025 | 10:17 PM

కొండపి సీహెచ్‌సీలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు.

కొండపి సీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు
సమావేశంలో మాట్లాడుతున్న స్వామి

ఎక్స్‌రే యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి స్వామి

వైద్యశాలలో ప్రసవాలు ప్రోత్సహించిన ఆశాలకు నగదు బహుమతులు అందజేత

కొండపి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : కొండపి సీహెచ్‌సీలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన కొండపి సీహెచ్‌సీలో 25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎక్స్‌రే యంత్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వైద్యశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యశాలలో ఎక్స్‌రే సేవలు రోగులకు అందుబాటులో ఉంటాయని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యశాలలో పోస్టుమార్టం చేసే కార్యక్రమాలు త్వరలో మొదలవుతాయని ఆయన అన్నారు. వైద్యశాలలో డాక్టర్లు అందరూ అందుబాటులో ఉన్నారని ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందాలన్నారు. వైద్యశాల ఆవరణలో రూ.40 లక్షలతో నిర్మిస్తున్న రూఫ్‌ టాప్‌ నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ కె.నాగమణి, డాక్టర్లు, కొండపి ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొర్రెపాటి రామయ్య చౌదరి పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 10:17 PM