Share News

కర్నూలులో కీలకంగా..

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:32 AM

కర్నూలులో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయడంలో ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు అక్కడి ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కీలక నేతలతో కలిసి సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సమీప నియోజకవర్గాల నుంచి జన సమీకరణ ఏర్పాట్లలో నిమగ్నమై పనిచేస్తున్నారు.

కర్నూలులో కీలకంగా..
పాణ్యం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గొట్టిపాటి

ప్రధాని పర్యటన బాధ్యతల్లో ఉమ్మడి జిల్లా నేతలు

భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు

రేపు నరేంద్ర మోదీ జీఎస్టీ సభ

ఆరోజు దోర్నాల వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

కర్నూలులో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయడంలో ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు అక్కడి ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కీలక నేతలతో కలిసి సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సమీప నియోజకవర్గాల నుంచి జన సమీకరణ ఏర్పాట్లలో నిమగ్నమై పనిచేస్తున్నారు. అలాగే కర్నూలు సభ కోసం జిల్లా నుంచి 160 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. అదేవిధంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి మోదీ వస్తున్న నేపథ్యంలో పెద్దదోర్నాల నుంచి ఘాట్‌ రోడ్డులో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఒంగోలు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన ఏర్పాట్లలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. జీఎస్టీలో సంస్కరణలు తెచ్చి అనేక రకాల వస్తువులపై పన్నులు తగ్గించిన అనంతరం దేశవ్యాప్తంగా సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌ పేరుతో పెద్దఎత్తున సభలు నిర్వహించి ప్రజలకు సంస్కరణల ఫలితాలు వివరించాలని కేంద్రం నిర్ణ యించిన విషయం విదితమే. ఆ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి ప్రభుత్వం విస్తృతంగా అవగా హన కార్యక్రమాలు చేపట్టింది. అదే సమయంలో దేశంలో ఈ అంశంపై ప్రధాని మోదీ పాల్గొనే తొలిసభను రాష్ట్రంలో ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సంకల్పించారు. అందుకు వేదికగా కర్నూలును ఎంపిక చేశారు. ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం కర్నూలు నగర సమీపంలో ఈ సభ జరగనుంది. లక్షలాది మంది ప్రజలు హాజరయ్యేలా చూడటంతో పాటు సభా ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేస్తు న్నారు. అందుకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నేతలకు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. దీంతో రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌. ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణ తదితరులు అక్కడే మకాం వేసి పనిచేస్తున్నారు.

నియోజకవర్గాల్లో పర్యటనలు

తొలి రోజున సభాప్రాంగణంలో ఏర్పాట్లు, ముఖ్యనేతలు, అధికారులతో జరిగిన సమీక్షల్లో పాల్గొన్న జిల్లాకు చెందిన నేతలు మంగళవారం జనసమీకరణ చర్యలలో భాగంగా పలు నియోజక వర్గాల్లో పర్యటించారు, పాణ్యం నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో జరి గిన సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. డోన్‌ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పరిశీలకు డిగా పాల్గొన్నారు. కోడుమూరు నియోజకవర్గ టీడీపీ సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పాల్గొని ప్రధాని సభకు జనసమీకరణపై అక్కడి పార్టీశ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అధిష్ఠానం సూచనలకు అనుగు ణంగా స్థానికంగా ప్రజలను కదిలించే అంశంపై అక్కడి నాయకులతో చర్చించారు. పలువురు రాష్ట్ర మంత్రులు, కీలక నేతలతో కలిసి ప్రధాని సభ జరిగే ప్రాంగణంలో ఏర్పాట్ల పర్యవేక్షణలో మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య పాల్గొన్నారు.

అప్రమత్తమైన పోలీసులు

ప్రధాని నరేంద్రమోదీ గురువారం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సందర్శించనున్నారు. దీంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలం బందోబస్తుకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో పోలీసులు వెళ్తున్నారు. మరోవైపు శ్రీశైలం వెళ్లే మార్గంలో దోర్నాల కీలక ప్రాంతం కాగా అక్కడ కూడా పోలీసులు మకాం వేస్తున్నారు. దోర్నాల వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి ఇటు పల్నాడు ప్రాంతం, మార్కాపురం వైపు నుంచి శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలన్నింటినీ 16వతేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దోర్నాల వద్దనే నిలిపివేసేలా జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. పల్నాడు ప్రాంతం నుంచి కర్నూలు వైపు వెళ్లే వాహనాలను పెద్దారవీడు మండలం కుంట నుంచి గిద్దలూరు, నంద్యాల వైపు మళ్లిస్తున్నారు. అలాగే నల్లమల అటవీ ప్రాంతంలోనూ ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 12:33 AM