సీఎం ఇచ్చిన హామీ అమలు
ABN , Publish Date - Aug 14 , 2025 | 10:57 PM
సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమలైంది. అన్నదాత సుఖీభవ పథకం మండలం తూర్పువీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే.
బాధిత కుటుంబానికి సాయమందించిన డాక్టర్ లక్ష్మి
దర్శి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమలైంది. అన్నదాత సుఖీభవ పథకం మండలం తూర్పువీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తూర్పువీరాయపాలెం గ్రామానికి చెందిన జీ చిన్నయలమంద కుమారుడు పోలియో వ్యాధితో బాధపడుతున్నాడు. భార్యాభర్తలు ఆ బాలుడిని తీసుకొని చంద్రబాబు వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన సీఎం రూ.1.5లక్షలు ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కును టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బాధిత కుటుంబానికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దర్శి పర్యటనలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారంశెట్టి పిచ్చయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, నాయకులు నాగేశ్వరరావు, కొండలు పాల్గొన్నారు.