అక్రమ గోడ కూల్చివేత
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:56 AM
రామాపురం తీరంలో కొంతకాలంగా ఓ రిసార్ట్ నిర్వాహకునికి, అధికారులకు మఽధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌లో మంగళవారం అధికారులు ఒక అడుగు ముందుకేశారు.
రామాపురం(చీరాల), అక్టోబరు14 (ఆంధ్రజ్యోతి) : రామాపురం తీరంలో కొంతకాలంగా ఓ రిసార్ట్ నిర్వాహకునికి, అధికారులకు మఽధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌లో మంగళవారం అధికారులు ఒక అడుగు ముందుకేశారు. సీఆర్‌జడ్(కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్) నిబంధనలు అతిక్రమించి నిర్మించిన గోడను కూల్చివేశారు.
రామాపురం తీరంలోని ఆర్య గ్రాండ్ రిసార్ట్ నిర్మాణంపై కొంతకాలంగా నిర్వాహకులకు, అధికారులకు మఽధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నిర్మాణం అక్రమమంటూ గతంలో ఉన్న కలెక్టర్ వెంకట మురళీ ఆధ్వర్యంలో నోటీసులు కూడా అందించారు. అయితే తనకు అనుమతులున్నాయని, నిర్వాహకులు కోర్టును ఆశ్రయించడంతో ఎటూ తేల్చలేక అధికారులు మల్ల గుల్లాలు పడ్డారు. వదిలేద్దామా..? న్యాయపోరాటం చేద్దామా..? అని అధికారులు ఒక దశలో మల్లగుల్లాలు పడ్డారు.
ఇదీ నేపథ్యం..
ప్రస్తుతం నడుస్తున్న రిసార్ట్‌ను గొర్రెల పెంపకం షెడ్డుగా ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రారంభసమయంలో అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. అయితే కొద్దిరోజులు అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కొంతకాలం తర్వాత అటువైపు చూసి నివ్వెరపోయారు. ఏకంగా ఆధునిక హంగులతో రిసార్ట్‌గా రూపుదిద్దు కుంది. దీంతో అప్పటి నుంచి అధికారులు నోటీసులు ఇవ్వడం, తిరిగి రిసోర్టు యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. అధికారులు ఒక దశలో విసిగి వేసారిన అధికారులు 46 శాతం అపరాధ రుసుము చెల్లించుకుని కథను ముగించాలని కూడా సదిగ్ధంలో పడ్డారు.
మలుపు తిరిగిందిక్కడ..!
అయితే రిసార్ట్ నిర్వాహకులు మరో స్థలంలో కూడా కట్టడం నిర్మించేందుకు గోడను నిర్మించారు. అది సీలింగ్ ల్యాండ్ సర్వే నెంబర్ 427/3- 3బి/2సీలో ఉందని అనఽధికారమని అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. అయినా సెలవు రోజుల్లో అధికారులు కళ్లుగప్పి నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకున్నాడు. వెంటనే గోడ తొలగించాలని నోటీసులు స్పందన లేకపోవడంతో మంగళవారం ఏకంగా వేటపాలెం తహసీల్దార్ గీతారాణి ఆధ్వర్యంలో వీఆర్వోలు, పోలీసుల సమక్షంలో గోడను కూల్చారు. దీంతో ఒకింత అక్రమ నిర్వహణ దారుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది.