Share News

అక్రమంగా గంజాయి రవాణా..నిందితులు అదుపులో

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:50 PM

అడ్డదారిలో నగదు సంపాదించాలనే దురాశలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను జరుగుమల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 3.100 కిలోల గంజాయిని, రూ.8 లక్షల విలువచేసే 8 కేజీలు వెండి (57 కడ్డీలు), 9 గ్రామల బంగారం (రూ. 81వేలు), రూ.25 వేలు విలువచేసే మోటార్‌ బైక్‌ను సీజ్‌ చేశారు.

అక్రమంగా గంజాయి రవాణా..నిందితులు  అదుపులో
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్‌

రూ. 9.06 లక్షల వెండి, బంగారం, మోటార్‌ సైకిల్‌ సీజ్‌

వివరాలు వెల్లడించిన సీఐ హజరత్తయ్య

సింగరాయకొండ, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : అడ్డదారిలో నగదు సంపాదించాలనే దురాశలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను జరుగుమల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 3.100 కిలోల గంజాయిని, రూ.8 లక్షల విలువచేసే 8 కేజీలు వెండి (57 కడ్డీలు), 9 గ్రామల బంగారం (రూ. 81వేలు), రూ.25 వేలు విలువచేసే మోటార్‌ బైక్‌ను సీజ్‌ చేశారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ చావా హజరత్తయ్య జరుగుమల్లి ఎస్సై బత్తుల మహేంద్రతో కలిసి వివరాలు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాలు మేరకు.. ఒంగోలు నుంచి చైన్నై వెళ్లు జాతీయ రహదారి 16 పై జరుగుమల్లి మండలం వావిలేటిపాడు క్రాస్‌రోడ్డు ఇటుకల బట్టీల వద్ద అక్రమ గంజాయి రావాణా చేస్తున్నరనే సమాచారంలో పోలీసులు అక్కడికి వెళ్లారు. సంఘటనా స్థలంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌కి చెందిన ముకే్‌షకుమార్‌, గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంకి చెందిన ఒడ్లమాను శివారెడ్డి, ఒంగోలుకి గుర్రం జాఘవా నగర్‌కు ట్రంకు కార్తీక్‌ చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులు ముగ్గురిని పోలీసులు విచారించారు. అందులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముకే్‌షకుమార్‌ సుమారు నాలుగేళ్ల నుంచి మద్దిపాడు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. మద్దిపాడు హైవేపై లారీ డ్రైవర్ల నుంచి తక్కువ రేటుకి డిజిల్‌ కోనుగోలుచేసి ఎక్కువ రేటుకి అమ్ముతూ అక్రమంగా నగదు సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు. డిజిల్‌ వ్యాపారం తగ్గడంతో మేదరమెట్ల దగ్గరలోని గ్రోత్‌సెంటర్‌ వద్ద హోటల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అక్రమంగా నగదును సంపాదించడానికి గంజాయి రావాణా చేయడం ప్రారంభించారు. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లోకి వెళ్లి అక్కడ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కేజీ గంజాయిని రూ. 10వేలు చొప్పున కోనుగోలు చేసి దానిని చిన్నచిన్న ప్యాకెట్లగా చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ. 200 నుంచి 500 వరకు మేదరమిట్ల, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అమ్ముతూ నగదు సంసాదించుకుంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒడ్లమాను శివారెడ్డి, ఒంగోలుకి చెందిన కార్తీక్‌లు ముకే్‌షకుమార్‌ వద్దకు వచ్చి తరుచూ గంజాయి కోనుగోలు అమ్మకాలు చేసేవారు. ఈక్రమంలో ఇరువురు ముకే్‌షకుమార్‌ ఫోన్‌చేసి చెరొక కేజీ గంజాయి కావాలని అడుగుతారు. దీంతో ముకే్‌షకుమార్‌ జరుగుమల్లి మండలం వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్దకు వచ్చి గంజాయి ప్యాకెట్లు తీసుకొని వెళ్లమని చెబుతాడు. దీంతో సోమవారం ముకే్‌షకుమార్‌ గంజాయి ప్యాకెట్లు తీసుకొని జరుగుమల్లి అడ్డరోడ్డుకి వచ్చాడు. కొద్దిసేపటికి గంజాయి ప్యాకెట్లు తీసుకొని వెళ్లడానికి శివారెడ్డి, కార్తీక్‌లు అక్కడికి వచ్చారు. ముకే్‌షకుమార్‌ నుంచి ఇరువురు గంజాయి ప్యాకెట్లు తీసుకొని వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ హజరత్తయ్య, జరుగుమల్లి ఎస్సై బత్తుల మహేంద్రను జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Jul 14 , 2025 | 11:50 PM